జాతీయ వార్తలు

బాత్‌రూమ్‌లో కొత్త నోట్ల కట్టలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను శాఖ నల్లకుబేరుల నివాసాలపై జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన నల్లధనం బయటపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెరె పట్టణంలోని ఓ హవాలా వ్యాపారి ఇంట్లో జరిపిన దాడుల్లో దొరికిన నగదు, బంగారం చూసి ఐటి అధికారులే విస్తుపోయారు. బాత్‌రూమ్‌లో వాష్ బేసిన్‌కు పైన టైల్స్ వెనుక రహస్యంగా ఏర్పాటు చేసిన స్టీల్ బీరువాలో దాచి ఉంచిన రూ. 5.7 కోట్ల విలువైన కొత్త నోట్ల కట్టలు, 32 కిలోల బంగారం బిస్కట్లతో పాటుగా రూ 90 లక్షల విలువైన రద్దయిన పాతనోట్లు కూడా లభించాయి. హవాలా వ్యాపారి వివరాలను ఐటి అధికారులు వెల్లడించనప్పటికీ కన్నడ సీనియర్ నటుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర అని తెలుస్తోంది. వీరేంద్ర నివాసంలో పెద్ద ఎత్తున నగదు ఉందనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడి చేసిన ఐటి అధికారులకు ఇంట్లోని బాత్‌రూమ్‌లో రహస్యంగా ఏర్పాటు చేసిన స్టీల్ బీరువాలో కనిపించిన సొమ్ము చూసి నిర్ఘాంతపోయారు. రూ.5.7 కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల కొత్త నోట్లు, 28 కిలోల బంగారం బిస్కట్లు, మరో 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కనిపించాయి. హవాలా వ్యాపారితో పాటుగా అతని సోదరుడి ఇంటిపై కూడా ఐటి అధికారులు దాడి చేశారు. పనాజిలోని ఐటి శాఖ ఇనె్వస్టిగేషన్ విభాగం హుబ్బళ్లి, చిత్రదుర్గ జిల్లాల్లోని బంగారు వ్యాపారుల ఇళ్లు, క్యాసినోపై దాడులు జరిపిన తర్వాత ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున విలువైన డాక్యుమెంట్లను సుమారు 90 లక్షల విలువైన వంద, 20 రూపాయల నోట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో దాడులు ఇంకా కొనసాగుతున్నాయని, స్వాధీనం చేసుకున్న బంగారం, ఆభరణాల విలువ మదింపు జరుగుతోందని ఐటి అధికారులు చెప్పారు.