జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై భారత్, బంగ్లా ఉమ్మడి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తల, డిసెంబర్ 31: ఉగ్రవాదం, సాయుధ వేర్పాటువాదులపై భారత్, బంగ్లాదేశ్ కలిసికట్టుగా పోరాడుతాయని, బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల పార్లమెంటు బోర్డు అధ్యక్షురాలయిన దీపు మోనీ అన్నారు. ఉపఖండంలో మత ఛాందసవాదాన్ని అణచివేయడంలో బంగ్లాదేశ్ ఏమాత్రం రాజీపడదని, బంగ్లాదేశ్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిన భారత తిరుగుబాటుదారులు, భారత భూభాగాన్ని ఉపయోగించుకోచూసే ఉగ్రవాదులతో పోరాడిన చరిత్ర ఈ రెండు దేశాలకు ఉందని శుక్రవారం రాత్రి అగర్తల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ 45వ విజయదివస్ వేడుకల్లో మాట్లాడుతూ మోనీ అన్నారు. ఉల్ఫాకు చెందిన అనుప్ చెతియ, అరబింద రాజ్‌ఖోవా, శశధర్ చౌదరి చిత్రబన్ హజారికా, ఎటిటిఎఫ్‌కు చెందిన రంజిత్ దెబ్బర్మ, ఎన్‌ఎల్‌ఎఫ్‌టికు చెందిన బిశ్వమోహన్ దెబ్బర్మ లాంటి ఈశాన్య రాష్ట్రాల చెందిన తిరుగుబాటు నేతలను అరెస్టు చేయడం, భారత్‌కు అప్పగించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటుదారుల పట్ల తన కఠిన వైఖరిని బంగ్లాదేశ్ నిరూపించుకుందని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటినుంచి కూడా తమ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటున్నాయని ఆమె చెప్పారు. రెండు దేశాలు అంతర్జాతీయ నదీ జలాల సరిహద్దు వివాద పరిష్కారం, సరిహద్దు భూముల మార్పిడి ఒప్పందం, త్రిపుర ధర్మల్ విద్యుత్ కేంద్రంనుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం లాంటి పలు ఒప్పందాలను విజయవంతంగా కుదుర్చుకోవడాన్ని ఇందుకు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో హిందువులపై జరిగిన దాడుల గురించి ప్రస్తావిస్తూ భారతదేశ భద్రతకు, రక్షణకు ముప్పుగా పరిణమించే ఏ సంఘటననైనా తమ ప్రభుత్వం ఎప్పటిలాగానే అణచివేయడానికి ప్రయత్నిస్తుందని ఆమె చెప్పారు. తమ దేశం సాధించిన విజయాలు, భవిష్యత్ ఆకాంక్షల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక చైతన్యవంతమైన దేశమని చెప్పారు. తమ దేశంలో ఇప్పుడు ఆకలి చావులు లేవని, అందరికీ విద్య, వైద్య సదుపాయాలు లభిస్తున్నాయని ఆమె చెప్పారు. కాగా, బంగ్లాదేశ్ విముక్తిపోరాటంలో త్రిపుర రాష్ట్రం పాత్రను ఆమె ప్రశంసిస్తూ, ‘ఆ రోజుల్లో అగర్తల మా పోరాట యోధులకు కేంద్రంగా ఉండేది’ అని చెప్పారు.