జాతీయ వార్తలు

చల్లబడ్డ ములాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 31: గంటల వ్యవధిలోనే కొడుకుపై తండ్రి ఆగ్రహం చల్లారిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు కొత్త సిఎంను ఎంచుకుని కొడుకును పదవీచ్యుతుణ్ణి చేస్తానన్న ములాయం ప్రతిజ్ఞ నీరుగారిపోయింది. కొడుకును, తమ్ముణ్ణి పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసి హడావిడి చేసిన సమాజ్‌వాది చీఫ్ ములాయంసింగ్ ఇరవైనాలుగు గంటలు తిరక్కుండానే తన నిర్ణయాన్ని వాపస్ తీసేసుకున్నారు. పార్టీలో వివాదానికి మూలకారకుడైన శివపాల్ యాదవ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతాద్వారా తెలిపారు. ‘‘పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్‌ని, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో కలిసి వస్తున్నాను. అఖిలేశ్, రాంగోపాల్ యాదవ్‌లపై బహిష్కరణ వేటును తక్షణం రద్దు చేస్తున్నట్లు నేతాజీ ఆదేశాలిచ్చారు. మేమంతా కలిసి మతతత్వ శక్తులపై ఏకతాటిపై నిలిచి పోరాటం చేస్తాం. రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటానికి కృషి చేస్తాం. మేము అంతర్గతంగా చర్చించుకుని ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధం కావాలో కార్యాచరణ రూపొందించుకుంటాం’’ అని శివపాల్‌యాదవ్ శనివారం ట్వీట్ చేశారు. తమ నాయకుడు ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలో సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. అంతకుముందు శనివారం ఉదయమంతా లక్నోలో హైడ్రామా నడిచింది. శుక్రవారం బహిష్కరణ వేటు పడటంతో శనివారం ఉదయమే అఖిలేశ్ సమాజ్‌వాది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అధికార నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. 229మంది పార్టీ ఎమ్మెల్యేలలో 200మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొందరు ఎస్‌పి ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు కూడా అఖిలేశ్ నిర్వహించిన సమావేశానికి వచ్చారు. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఆజంఖాన్ కూడా ముందుగా అఖిలేశ్ నివాసానికి వెళ్లి కాసేపు ఉన్నారు. ఆ తరువాత అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న ములాయం ఇంటికి వెళ్లిపోయారు. సమావేశానికి ముందు నుంచీ ముఖ్యమంత్రి నివాసం బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పార్టీ యువ కార్యకర్తలు సిఎం ఇంటి ముందు గుమికూడారు. అఖిలేశ్ విధేయులు, పార్టీ రాష్టశ్రాఖ అధ్యక్షుడు శివపాల్‌యాదవ్ మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. పార్టీ కార్యాలయం బయట కూడా అదే పరిస్థితి. పరిస్థితి చేయి దాటిపోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. చరిత్రలోనే అత్యంత దారుణమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమాజ్‌వాదిలో సంక్షోభాన్ని నివారించే బాధ్యతను ఆర్జేడీ అధ్యక్షుడు, ములాయం బంధువు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ తన భుజానికెత్తుకున్నారు. ములాయంకు లాలూ ఫోన్ చేసి నచ్చచెప్పారు. నాయకుల మధ్య గొడవలు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని వివరించారు. దీంతో ములాయం దిగిరాక తప్పలేదు. తన సన్నిహితుడు శివపాల్ యాదవ్‌తో మంతనాలు జరిపి బహిష్కరణ వేటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీని రక్షించుకునేందుకు అఖిలేశ్, రాంగోపాల్‌లను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ములాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
chitram...
శనివారం యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ ఇంటి వద్దకు మద్దతుదారులు భారీగా చేరుకోవడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన దృశ్యం