జాతీయ వార్తలు

ప్రజల ఆశలపై నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31:ప్రధాని మోదీ ప్రసంగం ప్రజల ఆశలను నీరుగార్చిందని విపక్షాలు విరుచుకు పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల గత 50రోజులుగా ప్రజలు ఎదుర్కొన్న కష్టనష్టాలను పట్టనట్టుగానే మోదీ ప్రసంగం సాగిందని దుయ్యబట్టాయి. నోట్ల రద్దు గడువు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ అసలు సాధించిదేమిటో వెల్లడించలేదని, వాస్తవాలతో నిమిత్తం లేకుండా పసలేని రీతిలోనే ఆయన ప్రసంగం సాగిందని విమర్శలు గుప్పించాయి. తప్పుడు హామీల వ్యాపారిగా మోదీని అభివర్ణించిన కాంగ్రెస్ ‘ఈ 50రోజుల్లో ఎన్ని లక్షల కోట్ల మేర నల్లధనం,నకిలీ కరెన్సీని తొలగించారో మోదీ అసలు చెప్పనే లేదు’అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్చేవాల అన్నారు. ఎన్నో రకాలుగా ఊరట కలిగించే నిర్ణయాలను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలుగలేదన్నారు. ఇప్పటి వరకూ లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, కోట్లాది మంది ఆర్ధికంగా చితికిపోయారని చెప్పిన ఆయన వీరిని ఆదుకునేందుకు ఏమీ చేయబోతున్నదీ మోదీ ప్రసంగంలో మచ్చుకైనా లేదన్నారు. నోట్ల రద్దు కారణంగా ఇప్పటి వరకూ 125మంది మరణించారని, వారి గురించి కనీసం సానుభూతి వ్యాఖ్య అయినా మోదీ చేయలేదన్నారు. నోట్ల రద్దు వల్ల రైతులు, పేదలు పడ్డ కష్టాలను ప్రధాని మోదీ విస్మరించారని వామపక్షాలు ధ్వజమెత్తాయి. ఏమి సాధించారో చెప్పకుండానే మోదీ తన ప్రసంగం ముగించారని తెలిపాయి. గర్భిణిలకు 6వేలు ఇవ్వాలన్నది జాతీయ ఆహార భద్రతా చట్టంలో భాగమేనని గుర్తు చేశాయి. ఇప్పటి వరకూ ఈ నిబంధనను అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మొత్తం 45నిముషాల ప్రసంగంలో మోదీ ఓ ప్రచారక్‌గానే మాట్లాడారని..ఆయన మాటలు బడ్జెట్ ప్రసంగానే్న తలపింపజేశాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పేదలు, రైతుల ఇబ్బందులను తీర్చడంలో మోదీ విఫలమయ్యారని, రానున్న యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడారని తెలిపారు. రద్దు చేసిన కరెన్సీ అంతా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసిందని చెప్పడమంటే అసలు దేశంలో నల్లధనం లేనట్టేనా..నకిలీ కరెన్సీ కూడా వ్యవస్థలో భాగమైపోయిందా అని ఏచూరి ప్రశ్నించారు. అసెంబ్లీ, లోక్‌సభకు ఏకకాల ఎన్నికలకు సిద్ధమని మోదీ ప్రకటించడాన్ని ప్రస్తావించిన ఏచూరి ‘రాజ్యాంగంలోని 356 అధికరణ రద్దుకు ఆయన సిద్ధంగా ఉన్నారా..’అని ప్రశ్నించారు.