జాతీయ వార్తలు

రెచ్చిపోయన ‘తృణమూల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 4: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ అరెస్టుకు నిరసనగా బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చారు. హుగ్లీ జిల్లాలో బిజెపి కార్యాలయాన్ని తగులబెట్టారు. బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు నిరసన ప్రదర్శన చేశారు. మంగళవారం బిజెపి కార్యాలయంపై టిఎంసి కార్యకర్తలు దాడిచేసి రాళ్లవర్షం కురిపించడంతో 15 మంది గాయపడ్డం తెలిసిందే. మంగళవారం తృణమూల్ కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడి చేయడంపై తీవ్రంగా స్పందించిన బిజెపి రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతున్నందున రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ, ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపించాలని రాష్ట్ర గవర్నర్ కె.ఎన్ త్రిపాఠీని కోరింది. తృణమూల్ కార్యకర్తలు నగరంలో సుప్రియో నివాసం ఉన్న హౌసింగ్ సొసైటీ వద్ద ఆయన అరెస్టును డిమాండ్ చేస్తూ ప్రదర్శన జరపడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో రైలురోకోకు సైతం దిగారు. టిఎంసి కార్యకర్తలు సొసైటీ ముందు బిజెపి జెండాను తగులబెట్టారని చెప్పిన సుప్రియో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడాన్ని ప్రశ్నించారు. రోజ్‌వ్యాలీ కుంభకోణంలో తనకు ప్రమేయం ఉందనడానికి దీదీ (మమతా బెనర్జీ) ఏదయినా సాక్ష్యం చూపిస్తే తనను అరెస్టు చేసుకోవచ్చని కూడా ఆయన అన్నారు. తృణమూల్ కార్యకర్తలు నగరంలోని సిబిఐ కార్యాలయం ముందు సైతం నిరసన ప్రదర్శన జరిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థా చటర్జీ నేతృత్వంలో ప్రతినిధివర్గం ఒకటి గవర్నర్‌ను కలిసి తమ పార్టీ పట్ల కేంద్రం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు. రోజ్‌వ్యాలీ నిధుల కుంభకోణం కేసులో సుప్రియోను అరెస్టు చేయాలని కూడా పార్థా చటర్జీ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం రాజ్ భవన్‌కు వెళ్లి మంగళవారం టిఎంసి కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. మమతా బెనర్జీ బిజెపి ఆఫీసులపైన, నాయకులపైనా దాడులు చేసేలా తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.

చిత్రం... తమ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా బుధవారం కోల్‌కతాలో
ఆందోళన చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు