జాతీయ వార్తలు

పాక్‌కు బుద్ధొచ్చేలా జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: పాకిస్తాన్ ఉగ్రవాద పోకడలపై వరుసగా మూడోరోజు కూడా కొత్త ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తీవ్రవాదంపై పాకిస్తాన్ పునరాలోచించుకునే విధంగా తదుపరి చర్యలు కఠినంగానే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆర్మీ వైస్‌చీఫ్‌గా రావత్ ఉన్నప్పుడే ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ లక్షిత దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన రావత్ పాక్‌కు తాజాగా చేసిన హెచ్చరిక మరింత వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను కఠినంగా దండిస్తేతప్ప వీరి చర్యలవల్ల ప్రజలకు కష్టం ఏమిటో అర్థంకాదని రావత్ అన్నారు. భారత్‌పై వ్యూహాత్మక రీతిలో అణు దాడులకు పాల్పడతామన్న పాక్ హెచ్చరికలను రావత్ కొట్టిపారేశారు. ఈ తరహా ప్రకటనలకు భయపడేది లేదని, తమ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో భారత్ ఎదురులేని శక్తిగానే ముందుకు వెళ్తుందని ఆర్మీ చీఫ్ ఉద్ఘాటించారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ధోరణి మారకపోతే దానికి గట్టిగా బుద్ధిచెప్పే విధంగా సమీకృత రీతిలో దాడులు చేపడతామని అన్నారు. అసలు ఉగ్రవాదాన్ని ఎందుకు సమర్ధిస్తున్నామా అని పాకిస్తాన్ వాపోయే రీతిలో అత్యంత కఠినంగా ఈ దాడులు ఉంటాయని అన్నారు. ఉగ్రవాదంవల్ల కలిగే కష్టనష్టాలు, బాధ శత్రుదేశానికి తెలియాలంటూ రక్షణ మంత్రి పారికర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినపుడు అన్ని రకాల దాడులను ఒకే కోణంలో చూడాల్సిన అవసరం లేదని కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించడానికి ఎప్పడికప్పుడు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు అదేస్థాయిలో చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రావత్ పేర్కొన్నారు. అణు దాడికి సంబంధించి పాకిస్తాన్ చేసిన హెచ్చరికలను ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా చాలాగట్టిగా ప్రతిఘటించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.