జాతీయ వార్తలు

హోం శాఖ నివేదిక తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికపై చర్చించడానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబి సింగ్ బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. మణిపూర్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారిందని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడాన్ని ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి రమేశ్ చెన్నితాలాతో కలిసి ఇబోబి రాష్టప్రతిని కలిశారు. అయితే వీరు రాష్టప్రతిని కలవడానికి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మార్చి 4, 8 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్టప్రతితో భేటీ అనంతరం ఇబోబి విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇసికి సమర్పించిన నివేదికలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా లేదని పేర్కొనడం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని ఆయన అన్నారు. తీవ్రవాదం, దిగ్బంధాలు, సమ్మెలు కేవలం మణిపూర్‌కు మాత్రమే సంబంధించినవి కావని, మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆయన పేర్కొన్నారు. 2012లోనూ అప్పటి ఎన్నికలను పిఎల్‌ఎ, యుఎన్‌ఎల్‌ఎఫ్ సహా కొండ ప్రాంతాల్లో ప్రాబల్యం గల అజ్ఞాత సంస్థలు బహిష్కరించాయని ఆయన గుర్తుచేశారు. మణిపూర్‌లో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్‌సి) నిరుడు నవంబర్ ఒకటో తేదీ నుంచి రెండు జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్న విషయం తెలిసిందే.
chitram...
బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్