జాతీయ వార్తలు

మద్య నిషేధంపై అవగాహనకు 2కోట్ల మందితో మానవహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 7: బిహార్‌లో మద్యనిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అతిపెద్ద మానవహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదట ఈ నెల 21న ఈ మానవహారాన్ని 5 వేల కిలోమీటర్ల పొడవునా నిర్వహించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భావించారు. అయితే రెండు రోజుల క్రితం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తుండడంపై ప్రశంసల వర్షం కురిపించిన తర్వాత ఈ మానవహారం పొడవును రెట్టింపు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు 11వేల కిలోమీటర్ల పొడవునా ఈ మానవ హారాన్ని ఏర్పాటు చేయాలని ఆయన యోచిస్తున్నారు. 2 కోట్ల మందికి పైగా జనం ఈ మానవ హారంలో పాలుపంచుకునేలా చూడడానికి బిహార్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే గనుక కార్యరూపం దాల్చినట్లయితే ఏదయినా ఒక సమస్యపై ప్రపంచంలో ఏర్పాటయిన అతిపెద్ద మానవహారం ఇదే అవుతుంది. ఈ మానవ హారం టైమింగ్‌ను ఇంకా ఖరారు చేయలేదు. అరగంట వ్యవధిలోపలే ఈ మానవహారం ఏర్పాటవుతుందని అంటున్నారు. ఈ మానవహారాన్ని ఫొటోలు తీయడానికి ప్రతి జిల్లాల్లోను పలు డ్రోన్‌లు, హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేస్తారు. శాటిలైట్ ద్వారా దృశ్యాలు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)ను కూడా సంప్రదించినట్లు చెబుతున్నారు. మానవహారం మద్య నిషేధానికి సామాన్యుడు ఆమోదముద్ర వేశాడనేదానికి నిదర్శనంగానే కాకుండా ఏదో ఒక రూపంలో మద్యనిషేధం పాలసీని అమలు చేసేలా పొరుగు రాష్ట్రాలయిన జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాలపై కూడా ఒత్తిడి తీసుకు రావడానికి కారణమవుతుందని బిహార్ చీఫ్ సెక్రటరీ అంజనీకుమార్ సింగ్ అంటున్నారు.
ఒక కిలోమీటరు పరిధిలో దాదాపు 2 వేల మంది ప్రజలు చేరుూచేరుూ పట్టుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఆ లెక్కలో మానవహారంలో పాల్గొనే జనం సంఖ్య 2కోట్లకు పెరిగినప్పుడు ఆ మేరకు ఏరియా కూడా పెరగాల్సి ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రంలో మద్య నిషేధం విధానాన్ని అమలు చేసినప్పటినుంచి ఇప్పటివరకు మద్యం సేవించడం లేదా మద్యం రవాణా సాగించడం ఆరోపణలపై 16 మందికి పైగా ప్రజలపై కేసులు పెట్టారు.