జాతీయ వార్తలు

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/సిమ్లా/నైనిటాల్, జనవరి 7: ఉత్తరాది రాష్ట్రాల్లో శనివారం భారీగా మంచు కురిసింది. దీంతో కాశ్మీరులో జనజీవనం స్తంభించిపోగా, హిమాచల్‌ప్రదేశ్ తీవ్రమైన చలితో వణికిపోయింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ పట్టణం రెండేళ్ల తర్వాత మళ్లీ మంచు దుప్పటి కప్పుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, కిన్నౌర్ ప్రాంతంలో భారీగా మంచు కురవడం ప్రస్తుత సీజన్‌లో ఇదే తొలిసారి. ఈ మంచు వలన ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలతో పాటు టెలి కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారు. సిమ్లాకు 13 కిలోమీటర్ల దూరంలోని షోఘీలో శనివారం మధ్యాహ్న సమయం వరకే 40 సెంటీమీటర్ల మంచు కురవడంతో అక్కడినుంచి 13 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కఫ్రీ, ఫగు, నర్కందలలో 45 నుంచి 55 సెంటీమీటర్ల మంచు కురిసింది. దీంతో హిమాచల్‌ప్రదేశ్ ఎగవన గల గిరిజన ప్రాంతాలకు హిమపాత ముప్పు పొంచి ఉందని, కనుక ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

చిత్రం... సిమ్లాలో భారీగా మంచు కురుస్తుండటంతో గొడుగులు వేసుకుని వెళ్తున్న జనం