జాతీయ వార్తలు

కేరళ ఎంపి అహ్మద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళవారం పార్లమెంటులో గుండెపోటు
రామ్‌మనోహర్ లోహియాలో అర్ధరాత్రి మృతి
యధావిధిగా బడ్జెట్ సమర్పించిన జైట్లీ

న్యూఢిల్లీ / తిరువనంతపురం, ఫిబ్రవరి 1: పార్లమెంటులో మంగళవారం గుండెపోటుకు గురైన మాజీ కేంద్ర మంత్రి, కేరళ ఎంపి ఇ.అహ్మద్ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్టప్రతి ప్రసంగిస్తున్న సమయంలో అహ్మద్ కుప్పకూలిపోయారు. హుటాహుటిన రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మంగళవారం అర్ధరాత్రి 2.15 నిమిషాలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. 78 ఏళ్ల వయసున్న అహ్మద్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) తరఫున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు అనధికార రాయబారిగా అహ్మద్ పేరు తెచ్చుకున్నారు. మన్మోహన్‌సింగ్ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వంలో 2004-12 మధ్యకాలంలో విదేశీ వ్యవహారాలు, రైల్వే శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. మానవ వనరుల శాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించారు. ప్రముఖ పార్లమెంటేరియన్ అహ్మద్ మృతి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ముస్లింల సాధికారత కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారని, కేరళ అభివృద్ధి కోసం శ్రమించారని మోదీ ప్రశంసించారు.
సంప్రదాయాన్ని ధిక్కరిస్తారా?
బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు పార్లమెంటు సభ్యుడు అహ్మద్ మృతి ప్రకటనను ఆలస్యం చేయడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఎంపి మృతి చెందడంతో పార్లమెంటును వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేరళ సిఎం విజయన్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక ఎంపి మృతి చెందినా కేంద్రంలో ఎలాంటి చలనం లేదని, ఆయనకు నివాళులర్పించాల్సింది పోయి అగౌరవపరిచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. అహ్మద్ మృతి చెందిన విషయాన్ని పక్కనపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సభ్యుల మనోభావాలు దెబ్బతీశారని ధ్వజమెత్తారు.