జాతీయ వార్తలు

గద్దెపై శశికళ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 4: తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం చెన్నైలోని అన్నాడిఎంకె పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే పగ్గాలు చేపట్టిన శశికళా నటరాజన్ (చిన్నమ్మ) ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 8 లేదా, 9వ తేదీన ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని కూడా అంటున్నారు. మరోవైపు జయలలితకు అత్యంత సన్నిహితురాలయిన షీలా బాలకృష్ణన్ ప్రభుత్వ సలహాదారు పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఆదివారం జరిగే సమావేశానికి ఎలాంటి అజెండాను ప్రకటించకపోవడంతో శశికళను ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శశికళ ఇప్పుడు అసెంబ్లీ సభ్యురాలు కాదు. అయితే గత డిసెంబర్‌లో అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మృతి చెందిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయకు అత్యంత సన్నిహితురాలయిన శశికళా నటరాజన్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి కూడా జయలిలతలాగానే ఆమె కూడా అటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, ఇటు ముఖ్యమంత్రి పదవి చేపడతారనే మాట బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అవినీతి కేసుల కారణంగా గతంలో రెండుసార్లు సిఎం పదవినుంచి తప్పుకున్న జయ స్థానంలో ఆ పదవిని చేపట్టిన పన్నీర్ సెల్వం జయ మరణం తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినరోజునుంచే రెండు అధికార కేంద్రాలుండడం పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదంటూ పలువురు పార్టీ నేతలు పరోక్షంగా శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని సూచిస్తూ ఉండడం గమనార్హం.
నిజానికి జనవరి చివర్లోనే శశికళా నటరాజన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయనందుకుచెన్నైలోను, రాష్టవ్య్రాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన కారణంగా అధికార మార్పిడి ఆలస్యమైందని శశికళ మద్దతుదారులు అంటున్నారు.
మూడు దశాబ్దాల పాటు దివంగత జయలలిత బహిఃప్రాణంగా మెలిగిన శశికళ జయ మరణం తర్వాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రోజున జయ అడుగు జాడల్లోనే తాను కూడా నడుస్తానని పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ, పలువురు పార్టీ సీనియర్ నేతలను పార్టీ కీలక పదవుల్లో నియమించారు. అలాగే పార్లమెంటు, తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై వారికి దిశా నిర్దేశం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే అన్నాడిఎంకె లెజిస్లేచర్ పార్టీ సమావేశంపైనే అందరి దృష్టీ ఉంది.
షీలా బాలకృష్ణన్ రాజీనామా
ఇదిలా ఉండగా జయలలితకు అత్యంత నమ్మకస్థురాలిగా పేరొందిన షీలా బాలకృష్ణన్ శుక్రవారం రాత్రి ప్రభుత్వ సలహాదారు పదవికి హటాత్తుగా రాజీనామా చేశారు. గతంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పని చేసిన షీలా బాలకృష్ణన్ రిటైరయిన తర్వాత జయలలిత 2914 మార్చిలో ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. జయలలిత అనారోగ్యంతో ఆపోలో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమే ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఒంటిచేత్తో నడిపించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31తో ముగియనుండగా ఇప్పుడు హటాత్తుగా పదవికి ఎందుకు రాజీనామా చేశారో కారణం తెలియరాలేదు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే ఆమెను రాజీనామా చేయమని కోరినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇద్దరు సెక్రటరీలను కూడా వారి పదవులనుంచి తప్పించారు.