జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యం భూస్థాపితమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 18: పళనిస్వామి విశ్వాస ప్రకటన ఓటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ప్రతిపక్షాలన్నీ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ‘రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని దేశవ్యాప్తంగా అందరూ కోరుకుంటుంటే తమిళనాడులో మాత్రం అది పోట్లాటతో ముగిసింది’ అని బిజెపి వ్యాఖ్యానించింది. ‘్ఫలితం ఏమయినప్పటికీ ఎలాంటి కుంభకోణాల కళంకం లేని ప్రభుత్వం కావాలనే అందరి ఆకాంక్ష. ఇది ప్రజల ప్రభుత్వమో కాదో వేచి చూద్దాం. లేనిపక్షంలో ప్రజలే దీన్ని బహిష్కరిస్తారు’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారేతప్ప షాడో ప్రభుత్వాన్ని కాదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనలు తమిళనాడుకు, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణన్ అన్నారు. ఈ సంఘటనల కారణంగా ప్రజాస్వామ్యం, విలువలు భూస్థాపితమయ్యాయని పిఎంకె వ్యవస్థాపకుడు ఎస్ రాందాస్ అన్నారు. అసెంబ్లీ బలపరీక్ష అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకమైన రీతిలో జరిగిందని తమిళికం పార్టీ అధ్యక్షుడు కె కృష్ణస్వామి అంటూ, గవర్నర్ ఫలితాన్ని తిరస్కరించి, అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలకు ఆదేశించాలన్నారు.
ఓటింగ్‌కు గైర్‌హాజరయన
కోయంబత్తూరు ఎమ్మెల్యే
కోయంబత్తూరు, ఫిబ్రవరి 18: తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్షకు ముందు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కోయంబత్తూరు నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ ఆ వర్గంనుంచి బైటికి వెళ్లిపోవడమే కాకుండా విశ్వాస ప్రకటన ఓటింగ్‌కు గైరుహాజరవాలని నిర్ణయించుకున్నారు. తన నియోజకవర్గం ప్రజలు, తన అభిమానులు ప్రస్తుత అన్నాడిఎంకె నాయకత్వం తీరుకు వ్యతిరేకంగా ఉన్నారని అరుణ్ కుమార్ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అందుకే తాను ఓటింగ్‌కు గైరుహాజరు కావాలని, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
అంతేకాదు, కుటుంబ రాజకీయాల కబంధ హస్తాలనుంచి బైటపడాలని కూడా ఆయన ముఖ్యమంత్రిని కోరారు. డబ్బు, అధికారంకన్నా కూడా సిద్ధాంతాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. నిన్న రాత్రి తాను శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన కూవత్తూరు గోల్డెన్ బే రిసార్ట్స్‌నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెప్పిన ఆయన కోయంబత్తూరు అర్బన్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.