జాతీయ వార్తలు

43ఎయిర్‌పోర్టులు త్వరలో పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఫిబ్రవరి 18: దేశంలో నిరుపయోగంగా ఉన్న 43 విమానాశ్రయాలను మరో ఏడాదిలోగా ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపర్చడమే నిరుపయోగంగా ఉన్న ఈ 43 విమానాశ్రయాలను ఉపయోగంలోకి తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. విమానయాన రంగంకోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ఒక సాఫ్ట్‌వేర్‌పై ఏర్పాటుచేసిన మూడు రోజుల వర్క్‌షాపును శనివారం ప్రారంభించిన అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో చౌబే మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం దేశంలో 72 విమానాశ్రయాలున్నాయని, కొత్తగా ఈ 43 విమానాశ్రయాలు చేరడంతో భారత విమానయాన రంగంలో పెను మార్పు వస్తుందని ఆయన చెప్పారు. విమానయాన సంస్థలకు రూట్లను కేటాయించడానికి మరో 15-20 రోజులు పడుతుందని, కొత్తగా చేర్చిన ఈ విమానాశ్రయాలనుంచి విమాన సర్వీసులను ప్రారంభించడానికి వాటికి ఒకనెలనుంచి ఆరునెలల మధ్య సమయం పడుతుందని చౌబే చెప్పారు. ‘ఉడాన్’ పథకం కింద ఈ విమానాశ్రయాలకు వెళ్లే విమానాల్లో టికెట్ల ధరలను గంటకు రూ.2,500కు మించని విధంగా కేంద్ర ప్రభుత్వం విమాన టికెట్ల ధరలను నిర్ణయించిన విషయం తెలిసిందే. పునరుద్ధరణకోసం చేపట్టిన నిరుపయోగంగా ఉండిన ఈ విమానాశ్రయాలు దేశం నలుమూలలా ఉన్నట్లు ఆయన చెప్తూ, వీటిలో పది విమానాశ్రయాలు దక్షిణాదిలో ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతోపాటుగా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల కారణంగా విమాన టికెట్ల చార్జీలు దాదాపు 30 శాతం తగ్గినట్లు చౌబే తెలిపారు.