జాతీయ వార్తలు

కెనాల్‌ను నిర్మించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సట్లేజ్- యమున సంధాన కాలువ (ఎస్‌వైఎల్) నిర్మాణాన్ని చేపట్టాలంటూ తాము జారీ చేసిన ఉత్తర్వును అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు బుధవారం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలను పరిరక్షించాలని స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టుకు నిరసనగా గురువారం పంజాబ్‌లోకి ప్రవేశించి ఎస్‌వైఎల్ కాలువను తవ్వెయ్యాలని తన కార్యకర్తలకు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డి) పిలుపునిచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. చట్ట ప్రకారం ఇరు రాష్ట్రాలు వ్యవహరించాలని, శాంతి భద్రతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు పిసి ఘోష్, అమితావ రాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఉద్ఘాటించింది. హర్యానా ప్రభుత్వం తరపున వాదించిన శ్యామ్ దివాన్, పంజాబ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రామ్‌జత్మలానీ చేసిన వాదనలను విన్న అనంతరం సుప్రీం బెంచి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కెనాల్ నిర్మాణాన్ని అనుమతిస్తూ తాము ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, ఈ సంధాన కాలువను నిర్మించాలని తేల్చిచెప్పింది. అయితే ఇరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ విషయంలో కేంద్రం సంధానకర్తగా వ్యవహరించాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌కు సూచించింది.
ఈ కేసు తదుపరి విచారణను మార్చి రెండో తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ దీన్ని వాయిదా వేయాలన్న పంజాబ్ అభ్యర్థనను తిరస్కరించింది.