జాతీయ వార్తలు

సన్నద్ధంగా ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఫిబ్రవరి 22: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.‘ఎన్నికలు ప్రశాంతగా జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఆర్థిక దిగ్బంధం ప్రభారం ఏమాత్రం ఉండబోదని నమ్ముతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు భరోసా ఇచ్చింది. సమాజంలోని అన్ని వర్గాలు ఇందుకు సహకరించాలి’అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. మణిపూర్‌లో యునైటెడ్ నాగా కౌన్సిల్(యుఎన్‌సి) గత ఏడాది నవంబర్ 1 నుంచి ఆర్థిక దిగ్బంధం పేరిట నిరసన కార్యక్రమం చేపట్టింది. ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యుఎన్‌సి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. అయితే ఆర్థిక దిగ్బంధంతో రాష్ట్రంలో అస్థవ్యస్థ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యావసర సరుకుల రవాణా ముఖ్యంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్‌హెచ్-2(వయా దిమాపూర్) నుంచి, ఎన్‌హెచ్ 37(వయా జిరిబామ్)లను ఆందోళనకారులు దిగ్బంధనం చేశారు. ఇంధన కొరత నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది, భద్రతా దళాలకు ఏమేరకు ఇబ్బంది కలుగుతుందన్న విషయంపై జైదీ సమీక్షించారు. రాష్ట్ర, జిల్లా అధికారులతో లోతుగా చర్చించినట్టు బుధవారం ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పెట్రోల్, డీజిల్ కొరతలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అదనపుబలగాలను వినియోగించుకోనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు. రాష్ట్రం లో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ ‘పరిస్థితిని పూర్తిగా సమీక్షించాం. సివిల్,పోలీసు అధికారులను అప్రమత్తం చేశాం. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునేలా సంసిద్ధులవుతున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి ఇబ్బందులులేవు. ఎన్నికల ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేస్తామన్న విశ్వాసం మాకుంది’ అని జైదీ పేర్కొన్నారు. ఇరవై మంది జనరల్, 20 మంది పోలీసు, 20 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి మరో ఏడుగురు అవేర్‌నెస్ అబ్జర్వర్ల సేవలు వినియోగించుకుంటున్నట్టు జైదీ చెప్పారు.