జాతీయ వార్తలు

పాత నోట్లుంటే పదివేలు ఫైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: రద్దయిన పాత నోట్లు దగ్గర ఉంటే రూ.10వేల జరిమానా వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. స్పెసిఫైడ్ బ్యాంక్స్ నోట్స్ చట్టం-2017ను పార్లమెంట్ గత నెలలో ఆమోదించిన సంగతి తెలిసిందే. రద్దయిన పాతనోట్లు రూ.500, రూ. 1000తో సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపించే అవకాశం ఉందన్న కారణంగా ఈ చట్టాన్ని నోటిఫై చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఫిబ్రవరి 27న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీని ప్రకారం నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన మర్నాటి నుంచి అంటే నవంబర్ 9-2016 నుంచి డిసెంబర్ 30, 2016 వరకు విదేశాల్లో ఉండి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వారికి కనీసంగా రూ.50వేల వరకు జరిమానా వేస్తారు. వ్యక్తిగతంగా పాత నోట్లు పది కంటే ఎక్కువగా ఉన్నా లేక చదువు కోసం, పరిశోధన పేరుతో 25 నోట్ల కంటే ఎక్కువగా ఉంటే రూ. 10వేలు కానీ, ఉన్న నోట్లకు అయిదు రెట్లు కానీ ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. రద్దయిన పాత నోట్లను దగ్గర ఉంచుకోవటం కానీ, బదిలీ చేయటం కానీ ఈ చట్టం ప్రకారం నిషిద్ధం. దీన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధించే అధికారాన్ని ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌కు అప్పగించారు.