జాతీయ వార్తలు

ముంబయ సూపర్‌రిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 1: ప్రపంచంలో సూపర్‌రిచ్ సిటీల్లో వాషింగ్టన్, టొరొంటోలను అధిగమించి ముంబయి 21వ ర్యాంక్ సాధించింది. రియల్ ఎస్టేట్ దిగ్గజం నైట్ ఫ్రాంక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 125 నగరాలపై అధ్యయనం చేసి ఓ జాబితా రూపొందించింది. మొత్తం 89 దేశాల్లోని సూపర్ రిచ్ సిటీల్లో సర్వే జరిగింది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్టు 2017 ప్రకారం వాషింగ్టన్ డిసి, టొరొంటో నగరాలను ముంబయి దాటిపోయింది. ముంబయికి 21 ర్యాంక్ రాగా, దేశ రాజధాని ఢిల్లీకి 35వ ర్యాంక్ దక్కింది. గత దశాబ్దకాలంలో ముంబయిలో సంపన్నులు 290 శాతం పెరిగారని నివేదికలో వెల్లడించారు. ప్రపంచ మిలియనీర్లలో ముంబయి రెండు శాతం, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఐదుశాతం ఉన్నట్టు తెలిపారు. అలాగే ముంబయిలో సూపర్‌రిచ్‌లు 1340, ఢిల్లీలో 680, కోల్‌కతాలో 280, హైదరాబాద్‌లో 260 మంది ఉన్నట్టు వెల్లడించారు. 2015తో పోల్చుకుంటే సూపర్‌రిచ్‌లు పూణెలో 18 శాతం, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో 15 శాతం పెరిగినట్టు నివేదికలో తెలిపారు. ఫూచర్ హెల్త్ కేటగిరిలో చికాగో, సిడ్నీ, ప్యారిస్, సియోల్, దుబాయిలను దాటేసి ముంబయి 11వ ర్యాంకు సాధించింది.