జాతీయ వార్తలు

నల్లధనం అంతుచూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిబ్‌గంజ్ (జార్ఖండ్), ఏప్రిల్ 6:అవినీతి, నల్లధనంపై దేశవ్యాప్తంగా చేపట్టిన పోరాటం తుది వరకూ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ రెండు జాఢ్యాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను చెదలమాదిరిగా దొలిచేశాయని అన్నారు. అయితే ప్రజలు మద్దతు, సహకారంతో వీటికి వ్యతిరేకంగా చేపట్టిన యుద్ధాన్ని ఆపేది లేదని ఉద్ఘాటించారు. కొత్తతరం నిజాయితీని కోరుకుంటోందని ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. మరో ఐదేళ్ల కాలంలో అంటే 2022 నాటికి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని గుర్తు చేసిన మోదీ ‘దేశంలోని ప్రతి పౌరుడు ఈ ఐదేళ్లకాలంలో ముందడుగు వేస్తే భారత దేశం అభివృద్ధి పథంలో125కోట్ల అడుగులను పూర్తి చేయగలుగుతుందని చెప్పారు. కొన్ని స్వయం సహాయ సంస్థలకు చెందిన వారికి స్మార్ట్ఫోన్లను అందించిన మోదీ ‘రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు చెందిన వారిలో స్మార్ట్ఫోన్ల పట్ల అవగాహన నన్ను ఎంతో ఆశ్చర్య పరిచింది. వీటిని ఎలా ఉపయోగిస్తారన్న ప్రశ్నకూ వారు సరైన సమాధానం చెప్పారు’అని తెలిపారు.పేదలకు స్మార్ట్ఫోన్ల వినియోగం ఎలా తెలుస్తుందన్నవారికి ఇది గట్టి జవాబని, ఇదే విషయాన్ని పార్లమెంట్‌లోనూ చెబుతానని అన్నారు. గంగానదిపై నిర్మించిన రహదారి వంతెనను ప్రారంభించిన అనంతరం మరో సభలో మాట్లాడిన మోదీ ప్రజా జీవితాలు మెరుగుపడాలంటే అభివృద్ధి ఒక్కటే తారకమంత్రమని అన్నారు. ఎంతగా అభివృద్ధి జరిగితే అంతగానూ ప్రజలకు మేలుకలుగుతుందన్నారు. 2200కోట్లతో నిర్మించిన ఈ వంతెన వల్ల జార్ఖండ్-బీహార్ మధ్య సంధానత ఏర్పడుతుందని, దీని వల్ల మరింతగా అభివృద్ధికీ ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. ఈ తరహా పనులను సకాలంలో పూర్తి చేయడంలో కేంద్ర ఉపరితల రహదారుల మంత్రి గడ్కరీ నిష్ణాతుడని కితాబిచ్చారు. రెండున్నర సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని కాబట్టి ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెప్పారు. గంగానది ప్రజల జీవన రేఖ అని పేర్కొన్న మోదీ దీనిపై నిర్మితమవుతున్న అనేక ప్రాజెక్టుల వల్ల జార్ఖండ్ ఇతర రాష్ట్రాలకు మరింత చేరువ అవుతుందని చెప్పారు. ‘అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో మీ కళ్లతో మీరే చూస్తారు’అని ప్రజలనుద్దేశించి అన్నారు.
chitram...
గురువారం జార్ఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయ కార్యకర్తకు స్మార్ట్ఫోన్ అందజేస్తున్న ప్రధాని మోదీ