జాతీయ వార్తలు

పార్లమెంట్ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఒక దేశం, ఒక పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు వీలుకల్పించిన జిఎస్టీలాంటి అత్యంత ముఖ్యమైన బిల్లులను ఆమోదించిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. లోక్‌సభ సమావేశాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించిన అనంతరం నిరవధికంగా వాయిదా పడితే, రాజ్యసభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం వాయిదా పడింది. ప్రధాని నరేంద్రమోదీ రెండు సభల వాయిదా కార్యక్రమానికి హాజరయ్యారు. లోక్‌సభలో ప్రతిపక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, టిఎంసి నాయకుడు సౌగత్ రాయ్‌తోపాటు ఇతర ప్రతిపక్షం సభ్యలు జీరోఅవర్‌లో పలు ముఖ్యమైన అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను తెచ్చేవాడికి 11 లక్షల రూపాయల బహుమానం ఇస్తానంటూ బిజెపి నాయకుడు యోగేష్ వర్షినే చేసిన ప్రకటనను ప్రస్తావించేందుకు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభను నిరవధికంగా వాయిదా వేశారు. సభ్యులు తమ 377 నోటీసులను లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించిన సుమిత్రా మహాజన్, ప్రతిపక్షం అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ సమావేశాలు జరిగిన తీరు, ఆమోదించిన బిల్లులు, ఇతర లెజిస్లేటివ్ కార్యక్రమం వివరాలను చదివి వినిపించిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. మీరిలా ఏకపక్షంగా వ్యవహరించటం మంచిదికాదని మల్లిఖార్జున ఖర్గేతోపాటు ఇతర ప్రతిపక్షం సభ్యులు పదే పదే చెబుతున్నా సుమిత్రా మహాజన్ పట్టించుకోలేదు. భారతీయ జనతా యువమోర్చ నాయకుడు వర్షినే తమ ముఖ్యమంత్రి తల నరికేవారికి 11 లక్షల బహుమానం ఇస్తానని బహిరంగంగా ప్రకటించినా మీరు పట్టించుకోరా? అంటూ సౌగత్‌రాయ్ గట్టిగా అరిచినా స్పీకర్ ఖాతరు చేయలేదు.
పార్లమెంటు బడ్జెట్ మొదటి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు జరిగాయి. నెల విరామం తరువాత రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై బుధవారం వరకు సాగాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ మొత్తం 21 బిల్లులను ఆమోదిస్తే రాజ్యసభ 14 బిల్లులకు ఆమోదం తెలిపింది. అత్యంత ముఖ్యమైన జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపితే, దేశంలోని కోట్లాదిమంది వెనుకబడిన కులాలకు చెందిన వారి ప్రయోజనాల పరిరక్షణకు కొత్తగా రాజ్యాంగ ప్రతిపత్తితో ఏర్పాటు చేస్తున్న సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల జాతీయ కమిషన్ బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపినా రాజ్యసభ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించటం గమనార్హం. శతృవుల ఆస్తుల సవరణ బిల్లు, మానసిక ఆరోగ్య పరిరక్షణ బిల్లు, మెటర్నెటీ ప్రయోజనాల బిల్లు, వేతనాల చెల్లింపు సవరణ బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం మొదటిసారి బ్రిటీష్ పద్ధతికి స్వస్తిపలికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రతిపాదించటం గమనార్హం. దీనివలన బడ్జెట్ కేటాయింపులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఖర్చు చేసేందుకు వీలు కలుగుతుంది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, సాధారణ బడ్జెట్, ఆర్థిక బిల్లులోని పన్నుల ప్రతిపాదనలు తదితర ఆర్థిక సంబంధమైన అన్ని పనులను మార్చి 30లోగా పూర్తిచేసి కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి అవి అమల్లోకి వచ్చేందుకు వీలు కల్పించటం గమనార్హం. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో లోక్‌సభ 113 శాతం పని చేస్తే, రాజ్యసభ 97 శాతం పని చేసింది. రెండో విడత సమావేశాల్లో లోక్‌సభ 112 శాతం, రాజ్యసభ 87శాతం పని చేశాయి. లోక్‌సభలో వివిధ గొడవలు, గందరగోళం మూలంగా దాదాపు తొమ్మిది గంటల సమయం వృథా అయ్యింది. అయితే బిల్లులపై చర్చలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిచేసేందుకు దాదాపు 13 గంటలపాటు సమావేశాలను పొడిగించుకుని పని చేయడం ద్వారా నష్టాన్ని పూడ్చుకున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.