జాతీయ వార్తలు

ఓటికుండకు చప్పుడెక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఏప్రిల్ 15: కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్ష విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టిన మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ‘ఓటి కుండకు మోతెక్కువ’ అన్న తీరులో పాక్ వ్యవహరిస్తోందని, దాన్ని మనం పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు.‘ కొంకణి, హిందీభాషల్లో ఒక సామెత ఉంది. ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి అనేది దాని అర్థం. పాక్ చెప్తున్న వాటిని మనం పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు’ అని ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పారికర్ ‘డిడిన్యూస్’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాక్‌పై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఏదో ఒక విధంగా వార్తలో ఉండాలని పాక్ అనుకుంటోంది. అయితే అది చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతోంది. భారత్ గనుక తిరగబడడం ప్రారంభిస్తే ఎదుర్కొనే శక్తి తనకు లేదనే విషయాన్ని అది అర్థం చేసుకోవాలి’ అని ఆయన అన్నారు. ‘అయితే మనం శాంతిని కోరుకుంటున్నాం. రెచ్చగొట్టడం మనకు ఇష్టం లేదు. దానికోసమైనా వాళ్లు జాదవ్‌ను మనకు అప్పగించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా జాదవ్‌ను కిడ్నాప్ చేశారు. అతను పాకిస్తాన్‌లో లేడు. తాలిబన్లు అతడ్ని తమ దేశంనుంచి కిడ్నాప్ చేసి పాక్‌కు తీసుకెళ్లారని ఇరాన్ చెప్తోంది. ఈ విషయంలో పాక్‌కు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సరయిన సమాధానం చెప్పారు’ అన్నారు. జాదవ్‌కు ఏమయినా జరిగితే భారత్ చూస్తూ ఊరుకోబోదని ఆయన మరోసారి హెచ్చరించారు. అణుశక్తిని ఉపయోగిస్తామని గతంలో పాక్ బెదిరించేదని, అయితే సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత అలాంటి బెదిరింపులు చేయడం మానేసిందని పారికర్ అన్నారు. భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేయలేమనే విషయాన్ని పాక్ గ్రహించాలన్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో సాధించిందని పారికర్ తెలిపారు. పొరుగు దేశాలయిన పాక్, చైనాలతో సంబంధాలను ప్రస్తావిస్తూ దౌత్యనీతిలో మెతక దౌత్యం, కఠిన దౌత్యం అనేవి ఉంటాయని, ఇప్పుడు మొట్టమొదటిసారిగా కఠిన దౌత్యాన్ని చూస్తున్నామని అన్నారు. రక్షణ మంత్రిగా తన హయాంలో దేశ సైనిక శక్తిని పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సాయుధ బలగాల సామర్థ్యానికి మరింత పదును పెట్టామని తాను గట్టిగా చెప్పగలనని పారికర్ చెప్పారు. తాను రక్షణ మంత్రిగా బాధ్యతలనుంచి తప్పుకొనే నాటికి 25-30 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను.. అదికూడా 8 శాతం తక్కువ వ్యయానికి కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సత్వర నిర్ణయాలు తీసుకోవడంవల్ల దాదాపు 22 వేల కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని పారికర్ చెప్పారు.