జాతీయ వార్తలు

సముద్రంలో మునిగి ఎనిమిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరీ (మహారాష్ట్ర), ఏప్రిల్ 15: కర్ణాటక నుంచి మహారాష్టక్రు పిక్నిక్ కోసం వచ్చిన ఒక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఎనిమిది మంది శనివారం సముద్రంలో మునిగి చనిపోయారు. సింధుదుర్గ్ జిల్లాలోని వైరీ తీరంలో అరేబియా మహాసముద్రంలోకి దిగిన వీరు నీట మునిగి చనిపోయారని పోలీసులు చెప్పారు. బెల్గాంలోని మరాఠా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 47 మందిలో 30 మంది ఈతకోసం సముద్రంలోకి దిగారు. వీరిలో అయిదుగురు బాలురు, ముగ్గురు బాలికలు నీట మునిగిపోయారు. మరో ముగ్గురు విద్యార్థులను స్థానికులు, పోలీసులు కలిసి రక్షించారు. మిగతా 19 మంది విద్యార్థులు స్థానికులు, పోలీసుల సహాయంతో ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. కొంకణ్ రీజియన్‌లోని మల్వాన్ పట్టణం సమీపంలో గల తీర గ్రామమైన వయ్‌రి సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు వివరించారు. సాధారణంగా మధ్యాహ్నం సమయంలో అలలు పెద్ద ఎత్తున వస్తుంటాయని, ఆ సమయంలో కొంత మంది విద్యార్థులు తెగించి లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లారని, వారిలో కొంతమంది మునిగిపోవడం ప్రారంభమయిందని, దీన్ని గమనించిన మిగతా విద్యార్థుల్లో కొంతమంది వారిని రక్షించడానికి వెళ్లారని పోలీసులు వివరించారు. అయితే అప్పటికే ఆలస్యమయిందని ఎనిమిది మంది విద్యార్థులు నీట మునిగిపోయారని తెలిపారు. ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు తీరానికి తీసుకొచ్చారు. వీరిలో ఇద్దరు మాల్వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉన్న ఒక బాలిక ఓరోస్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సింధుదుర్గ్ ఎస్‌పి అమోగ్ గోవాంకర్ తెలిపారు.