జాతీయ వార్తలు

ఎవరి ఆస్తులు వారివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యామండలి వ్యవహారంపై కేంద్ర హోంశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల్లోని స్థిర, చర ఆస్తులు ఎక్కడుంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఉమ్మడి ఉన్నత విద్యామండలిపై బుధవారం కేంద్రహోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 48 ప్రకారం జనాభా ఆధారంగా 58:42 నిష్పత్తిలో నగదు పంచుకోవాలని ఆదేశించింది. 2014 జూన్ 2 వరకే కాకుండా, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి సంస్థ ఎప్పటి వరకు సేవలు అందించిందో అప్పటి వరకున్న నగదు నిల్వలను సైతం జనాభా నిష్పత్తి ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని హోంశాఖ ఆదేశాలలో వెల్లడించింది. ప్రస్తుతం ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే కొనసాగాలని సూచించింది. ఉమ్మడి విద్యా మండలిలో అదనపు ఉద్యోగుల ఉంటే, వారిని సీనియారిటీ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంటుందని హోంశాఖ సూచించింది. ఉన్నత విద్యామండలి వ్యవహారంపై గత ఏడాది సుప్రీంకోర్టు మార్చి 18న తుది తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం అమలు పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల అధికారులతో మూడుసార్లు సమావేశాన్ని నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇరు రాష్ట్రాల అధికారుల అభిప్రాయం మేరకే తుది నిర్ణయం తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. తమకు సిబ్బందికి కేటాయించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖరాసిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టిపెట్టింది. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై పూర్తిస్థాయి హక్కులు తమవేనని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించగా, దీనికి ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. ఇరు రాష్ట్రాలు కలిపి ఉన్న కాలంలో కొనసాగిన ఉన్నత విద్యా మండలి ఆస్తులు ఒక్క తెలంగాణకు మాత్రమే ఎలా చెందుతాయంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేగాక ఈ ఆస్తులు తెలంగాణవేనన్న హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ ఉన్నత విద్యామండలిని ఏ అధికారంతో, ఏ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో చెప్పాలని ప్రశ్నించింది. దాంతో సుప్రీం ఆదేశాలపై ఇరు రాష్ట్రాలూ హోంశాఖను ఆశ్రయించడంతో హోంశాఖ తాజా ఆదేశాలను ఇచ్చింది.