జాతీయ వార్తలు

వివిపిఎటిల కొనుగోలుకు కేంద్రం పచ్చ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వినియోగించడానికి పేపర్ ట్రయల్ మెషిన్లను కొనుగోలు చేయాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ల (ఇవిఎంల)తోపాటు పేపర్ ట్రయల్ మెషిన్లను ఉపయోగించాలని ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ వివిపిఎటి యూనిట్లను కొనుగోలు చేయాలన్న ఇసి ప్రతిపాదనపై కొద్దిసేపు చర్చించిన అనంతరం ఆ ప్రతిపాదనను ఆమోదించింది. దేశంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయడానికి 16 లక్షలకు పైగా ట్రయిల్ మెషిన్లను కొనుగోలు చేసేందుకు రూ. 3,174 కోట్లు ఇవ్వాలని ఇసి కోరింది. కేంద్ర క్యాబినెట్ ఇప్పటి వరకు కొత్త ఇవిఎంల కొనుగోలు కోసం ఇసికి రెండు దశల్లో రూ. 1,009 కోట్లు, రూ. 9,200 కోట్లు చొప్పున ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. 2014 జూన్ నుంచి ఇసి వివిపిఎటి మెషిన్ల కొనుగోలు కోసం నిధులు ఇవ్వవలసిందిగా కనీసం 11సార్లు కేంద్రాన్ని కోరింది. నిరుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌ఎన్‌ఎ జైదీ ఈ నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
అన్ని పోలింగ్ కేంద్రాలలో వివిపిఎటి మెషిన్లను ఉపయోగించేందుకు నిర్దిష్టమైన కాల పరిమితిని తెలియజేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 16 లక్షలకు పైగా వివిపిఎటిలను తయారు చేయడానికి రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఇసిఐఎల్, బిఇఎల్‌లకు 30 నెలల సమయం పడుతుందని అత్యున్నత న్యాయస్థానానికి ఇసి తెలిపింది. ఇదిలా ఉండగా, మరింత పారదర్శకత కోసం భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో తిరిగి పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలని ఇటీవల 16 పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఇటీవలి ఎన్నికల్లో ఇవిఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని బిఎస్‌పి, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తూ ఇసిపై విమర్శలు గుప్పించాయి. వివిపిఎటి మెషిన్ ఓటు ఏ చిహ్నానికి పడిందో తెలియజేసే చీటీని విడుదల చేస్తుంది. ఈ చీటీ ఒక బాక్సులో పడిపోతుంది. కాని, ఓటు వేసిన తరువాత ఏడు సెకన్లలోపు ఓటు వేసిన వ్యక్తి తన ఓటు ఏ చిహ్నానికి పడిందో చూసుకోవచ్చు.