జాతీయ వార్తలు

ఏకీకృత సర్వీసులకు త్వరలోనే ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్ త్వరలోనే ఆమోదం పొందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారం తెలిపారు. ఈ విషయంలో కృషి చేసిన రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులను ఆయన అభినందించారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తనతో సమావేశమైనట్టు తెలిపారు. ఇతర వ్యవహారాల్లో కూడా అదే స్ఫూర్తిని రెండు రాష్ట్రాలు కొనసాగించాలని ఆయన హితవు పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ విభజన జరిగిపోయిన చరిత్ర అని, రెండు రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకోవాలని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లు అంతా ఒకటేనన్నారు. విభజన జరిగి మూడు సంవత్సరాలు అయినా చాలా అంశాలు పరిష్కారం కాలేదని వెంకయ్య వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని సంస్థల విభజన, ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపిణీ, ఏపీ భవన్ విభజనలాంటి సమస్యలు రెండు రాష్ట్రాలు కుర్చోని పరిష్కరించుకోవాలని తెలిపారు.