జాతీయ వార్తలు

ఉగ్రదాడులకు లష్కరే కుట్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోకి చొరబడిన
20మంది మిలిటెంట్లు
ఇంటెలిజన్స్ ఏజన్సీల హెచ్చరిక
యురి సరిహద్దుల్లో
ఇద్దరు పాక్ సైనికులు హతం

న్యూఢిల్లీ, మే 26: లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన 20 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, దేశంలో ఉగ్రవాద దాడి చేయడానికి పథకాలు వేసుకున్నారని కేంద్ర ఇంటెలిజన్స్ సంస్థలు రాష్ట్రాల్లోని ఉగ్రవాద నిరోధక విభాగాలను హెచ్చరించాయి. పాక్ గూఢచార ఏజన్సీ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని, ముంబయి, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లలో దాగి ఉన్నారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. దేశంలో అందరి దృష్టినీ ఆకట్టుకునే ఉగ్రవాద దాడి జరపాలన్నది వారి ప్రణాళిక అని ఆ వర్గాలు తెలిపాయి. ముప్పు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇంటెలిజన్స్ ఏజన్సీ ఢిల్లీ పోలీసులోని అన్ని విభాగాలకు ముందస్తు హెచ్చరికలను పంపించింది. నగరంలోని మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అలాగే పర్యాటకులు బస చేసే హోటళ్లు, ఇతర పర్యాటక ప్రాంతాలు, అన్ని ప్రార్థనా స్థలాలు, స్టేడియంల వద్ద గట్టి నిఘాను కొనసాగించాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆ అడ్వైజరీ సూచించింది.
ఇద్దరు పాక్ సైనికులు హతం
ఇదిలా ఉండగా, జమ్మూ- కాశ్మీరులోని యురీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద భారత సైనిక జవాన్లు శుక్రవారం పెద్ద చొరబాటు యత్నాన్ని భగ్నం చేశారు. పాకిస్తానీ బోర్డర్ యాక్షన్ టీమ్ (బిఎటి) ప్రోద్బలంతో జరిగిన ఈ చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టేందుకు భారత సైనికులు జరిపిన ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు హతమయ్యారని పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఎల్‌ఓసి వెంబడి భారత గస్తీ బృందంపై దాడి జరిపేందుకు బిఎటి సభ్యులు పథకం పన్నారన్న సమాచారం అందడంతో రంగంలోకి దిగిన సైనిక దళం భీకర స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకుపడింది. ఈ కాల్పుల్లో హతమైన ఇద్దరు పాక్ సైనికుల మృతదేహాలు ఇప్పటికీ నియంత్రణ రేఖ వద్దే పడి ఉన్నాయి. చొరబాటుకు ప్రయత్నించిన వారు పాక్ సైనిక దళానికి చెందిన బిఎటి సభ్యులేనని భారత సైనిక దళం ప్రకటించింది. ఈ చొరబాటు యత్నానికి భారత సైనిక దళం దీటుగా జవాబివ్వడం ద్వారా కొద్ది రోజుల క్రితం అత్యంత పాశవికంగా ఇద్దరు భారత జవాన్ల తలలు నరికిన పాకిస్తానీ బోర్డర్ యాక్షన్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.