జాతీయ వార్తలు

చీటర్లను వెంటాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 11,400 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం తొలిసారిగా స్పందించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మెగాస్కామ్‌లో దోషులెవరినీ వదిలి పెట్టేది లేదని ఉద్ఘాటించారు. చీటర్లను తుది వరకూ వెంటాడి పట్టుకుంటామని విస్మష్టంగా తెలిపారు. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించింది పంజాబ్ నేషనల్ బ్యాంకా? లేక వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీనా? అన్న ప్రస్తావన చేయకుండా మాట్లాడిన జైట్లీ దేశంలో కొన్ని వ్యాపారాలు నీతిబాహ్యంగా జరుగుతున్నాయని అన్నారు. గత ఏడేళ్లుగా ఈ కుంభకోణం జరుగుతున్నప్పటికీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆడిటర్లు దీన్ని ఎందుకు పసిగట్టలేక పోయారని ప్రశ్నించారు. ‘దేశం దగా పడేందుకు వీల్లేదు. చివరి వరకూ చీటర్లను వెంటాడతాం. ఇందుకు ప్రభుత్వం అన్ని మార్గాల్లోనూ ముందుకు వెళుతుంది’ అని అన్నారు. రోజురోజుకూ పేరుకు పోతున్న మొండి బకాయిలను తొలగించేందుకు ప్రభుత్వం దశల వారీగా అన్ని చర్యలూ తీసుకుంటోందని కానీ తాజా కుంభకోణంతో ఈ ప్రయత్నాలకే ఓ సవాలులాంటి పరిస్థితి ఏర్పడిందని జైట్లీ అన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలకు ప్రధాని నరేంద్ర మోది ఇచ్చిన విషయాన్ని జైట్లీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతటి స్వయం ప్రతిపత్తిని అందించినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత సదరు బ్యాంకు యాజమాన్యాలపై ఉందని అన్నారు. ఇంత భారీ కుంభకోణాన్ని ఏళ్ల తరబడి పసిగట్టలేకపోయారంటే వీటి సామర్థ్యంపైనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. అసలు బ్యాంకు ఆడిటర్లు ఇనే్నళ్లుగా ఏమీ చేస్తున్నారు? తమలో ఉన్న లోపాన్ని బ్యాంకులు ఎందుకు తొలగించుకోలేక పోయాయని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం జరిగిన విధానాన్ని బట్టి చూస్తే బ్యాంకు అంతర్గత, బహిర్గత ఆడిటర్లు పూర్తిగా విఫలమైనట్టు స్పష్టమవుతోందని ఆర్థిక మంత్రి తీవ్ర స్వరంతో అన్నారు. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు ఆత్మ పరిశీలన చేసుకుని ఇలాంటి వాటిని నివారించేందుకు ఎలాంటి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కుంభకోణాలకు ఆస్కారం ఇవ్వకుండా వాటిని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆ విధంగా సరికొత్త నియంత్రణ సంప్రదాయానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు.