జాతీయ వార్తలు

హోదా.. హోదా.. హోదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని కోరుతూ వరసగా రెండోరోజు పార్లమెంట్‌లో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరసనను కొనసాగించారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ అవరణ ఎంపీల నిరసనలతో హోరెత్తింది. గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు అమలు చేయాలని నినాదాలిస్తూ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ విభజన హామీలు నెరవేర్చవరకు పోరాటం అపేది లేదని స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం కాలయాపన చేస్తోందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిపిన చర్చల్లో ఎటువంటి పురోగతీ లేదని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులను కేంద్ర మంత్రి పట్టించుకోలేదని వాపోయారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న తరహాలోనే ఏపీకి రాయితీలు ఎందుకివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో తోట నరసింహం, మురశీమోహన్, నిమ్మల కిష్టప్ప, రవీంద్రబాబు, మాగంటి బాబు, కే.నారాయణ, కేశినేని నాని, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ వేషధారణలో శివప్రసాద్
వినూత్నంగా నిరసన తెలిపే ఎంపీ శివప్రసాద్ మంగళవారం ఎన్టీఆర్ వేషధారణలో పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర వ్యవహరిస్తోందని, అందుకే ఢిల్లీలో ఆంధ్రుల ఆత్మాగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ వేషధారణ చేసినట్లు శివప్రసాద్ పేర్కొన్నారు. ఢిల్లీ కంటే గొప్పగా అమరావతిని నిర్మిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ తరహాలో హావభావాలు పలికిస్తూ నిరసన తెలిపారు.
టీడీపీతో కలిసి నిరసన తెలిపిన కాంగ్రెస్
గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, రేణుకా చౌదరి స్వరం కలిపారు. కేవీపీ రామంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై తాను టీడీపీ కంటే ముందునుంచీ పోరాడుతున్నానని చెప్పారు. రేణుకా చౌదరి మాట్లాడుతూ విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తే కేంద్రానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ప్రధాన ద్వారం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నిరసన
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పార్లమెంట్ ప్రధాన ద్వారం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హోదా అంశంపై చర్చించాలంటూ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. ఏపీకి న్యాయం చేసేంతవరకూ నిరసనను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం దిగిరాకపోతే 20 తరువాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
chitram...
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో నినాదాలిస్తున్న తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ ఎంపీలు