జాతీయ వార్తలు

కోర్టులో కార్తీకి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సీబీఐ కస్టడీని ఈనెల 9 వరకు కోర్టు పొడిగించింది. అంతకుముందు కార్తీకి విధించిన ఐదురోజుల కస్టడీ సమయం ముగిసిపోయిన నేపథ్యంలో, ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా వద్ద సీబీఐ అధికార్లు ప్రవేశపెట్టారు. కేసు విచారణలో పురోగతి సాధించినప్పటికీ, కార్తీ సహకరించడం లేదని, తనను రాజకీయంగా బలి చేస్తున్నారనే ప్రతిదానికి చెబుతున్నారంటూ సిబీఐ అధికార్లు న్యాయమూర్తికి తెలిపారు. సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) తుషార్ మెహతా మాట్లాడుతూ కార్తీని ముంబయికి తీసుకెళ్లి బైకుల్లా జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జీతో కలిపి విచారించిన సందర్భంగా ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒక సాక్ష్యమన్నారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. విచారణ కొనసాగించాలంటే కార్తీ కస్టడీ పొడిగింపు అవసరం అని మెహతా కోర్టుకు తెలిపారు. కేసు కీలక దశకు చేరుకున్నందున, కార్తీ బెయిల్ పిటిషన్‌పై వివరణాత్మక సమాధానాన్ని ఫైల్ చేయడానికి సిబీఐకి రెండువారాల సమయం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమున్నదన్నారు. కాగా కార్తీ తరపు న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ కావాలనే సీబీఐ ఏదోవిధంగా కార్తీని కస్టడీలో కొనసాగించాలని కోరుతోందన్నారు. తన కుమార్తె హత్యకేసులో జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎంతవరకు విశ్వసనీయమని ప్రశ్నంచారు. కస్టడీలో ఉంచి మరీ విచారించడానికి కార్తీ ఉగ్రవాది కాడన్నారు.