జాతీయ వార్తలు

డిఫాల్టర్ల కట్టడికి మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయే పారిశ్రామికవేత్తల ఆటకట్టించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా తరహాలో ఇంకెవరూ విదేశాలకు చెక్కేయకుండా రుణగ్రహీతల పాస్‌పోర్టులకే గాలం వేసింది. 50 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారి పాస్‌పోర్టు వివరాలను 45 రోజుల్లో సేకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఒకవేళ సదరు రుణగ్రహీతకు పాస్‌పోర్టు లేని పక్షంలో ఆ విషయాన్ని ధృవీకరించే పత్రం తీసుకోవాలని కోరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రుణగ్రహీతల పాస్‌పోర్టు వివరాలు పొందుపరిచే విధంగా రుణాల దరఖాస్తుల్లోనూ మార్పుచేయాలని బ్యాంకులను కోరినట్టు తెలిపాయి. ఇలా పాస్‌పోర్టు వివరాలు సేకరించడం వల్ల సదరు వ్యక్తులు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. పాస్‌పోర్టు వివరాలు సేకరించకపోవడం వల్లే డిఫాల్టర్లను సకాలంలో కట్టడి చేసే అవకాశం లేకుండాపోయిందని అన్నారు. ఇప్పటికే డిఫాల్టర్ల ఆస్తులు వేలం వేసి రుణాలు రికవరీ చేసుకునేందుకు వీలుగా చట్టాన్ని తెచ్చేందుకు కేంద్రం నిర్ణయంచిన సంగతి తెలిసిందే.