జాతీయ వార్తలు

నేనొస్తే ఇస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉన్నామని, కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. అందరితో కలిసి కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీపై విభజన సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెస్తామన్నారు. మంగళవారం ఢిల్లీ సంసంద్ మార్గ్‌లో ఏపీ కాంగ్రెస్ నేతృత్వంలో విభజన హామీల అమలు డిమాండ్‌తో ఆత్మగౌరవ సభ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పల్లంరాజు మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు కేసులకు బయపడి కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా, విభజన హామీలు విషయంలో సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీలు ఏపీకి ద్రోహాం చేస్తున్నారన్నారు. కేంద్ర ఆర్థికశాఖ ప్రత్యేక హోదా ఇవ్వాలేమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు ఢిల్లీకి వచ్చి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా ఆంధ్రులు హక్కు అని, దాన్ని సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం అధినేత కొప్పుల రాజు మాట్లాడుతూ ఏపీ అభివృద్ది చెందాలంటే హోదా తప్ప వేరే మార్గం లేదన్నారు. నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, సుబ్బారామిరెడ్డి, బాపిరాజు, శైలజానాథ్ తదితరులు హాజరయ్యారు.
హామీల సాధన సమితి ధర్నా
ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో మంగళవారం సంసంద్ మార్గ్‌లో హామీల సాధన సమితి ఆందోళన చేపట్టింది. ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలతో హోరెత్తించారు. డివైఎఫ్‌లు నేతలు అర్థనగ్న ప్రదర్శన, ప్రజా సంఘాల కార్యకర్తలు వినూత్న ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం పాలిట్ బ్యూరో బివి రాఘవులు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కే.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు పిల్లి మొగ్గలేస్తున్నారని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. నాలుగేళ్ల క్రితం తాము ప్రత్యేక హోదా గురించి అడిగితే, అప్పుడు చంద్రబాబు హోదా వద్దన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.