జాతీయ వార్తలు

ఇచ్చిన వాటికి లెక్కలేవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రత్యేక హోదా డిమాండ్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న ఏపీకి కేంద్రం ఝలక్ ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదాను ఇచ్చితీరాల్సిందే నంటూ అమీతుమీకి దిగిన ఏపీతో కేంద్రం రివర్స్‌గేర్ గేమ్ మొదలుపెట్టింది. హోదాకు సమానమంటూ ఇచ్చిన ప్యాకేజీ నిధులు 12 వేల కోట్ల రూపాయలకు తక్షణం లెక్కలు చూపించాలంటూ కొత్త మెలిక మొదలుపెట్టంది. యుటిలైజేషన్ సర్టిఫికేట్లు కేంద్రానికి అందే వరకూ ప్యాకేజీగా ఇస్తున్న అదనపు నిధుల విడుదల సాధ్యం కాదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పేశారని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఢిల్లీలో సమావేశమైన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బృందానికి ఈమేరకు స్పష్టం చేసినట్లు సమాచారం. యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామమోహన్‌నాయుడు సోమవారం రాత్రి నార్త్ బ్లాక్‌లో అరుణ్ జైట్లీతో భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినప్పుడు, హోదా ప్రయోజనాలను ప్యాకేజీగా ఇస్తున్నాం కదా? అంటూ జైట్లీ నిలదీశారు. దీంతో ఆ చర్చకు తెరపడింది. రాష్ట్రానికి ఇవ్వవలసిన ఆర్థిక సహాయం గురించి ప్రశ్నించినపుడు.. పోలవరం ప్రాజెక్టుకు 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. రాజధాని నిర్మాణానికి రెండున్నర వేల కోట్లు ఇచ్చాం. బడ్జెట్ లోటు భర్తీకి 4 వేల కోట్లు ఇచ్చాం. మొత్తంగా కేంద్రం నుంచి ప్యాకేజీలో భాగంగా 12 వేల కోట్లు ఇంతవరకు రాష్ట్రానికి ముట్టాయి. ఈ 12వేల కోట్లకు లెక్కలు చూపించాలని జైట్లీ డిమాండ్ చేశారని అంటున్నారు. ఈ 12 వేల కోట్లకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు ఇచ్చిన తరువాతే, మిగతా నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి జైట్లీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారన్న కథనాలు గుప్పుమంటున్నాయ. ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక పన్ను రాయితీ ఇవ్వాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేసినప్పుడు కూడా జైట్లీ ఇదేవిధంగా స్పందించారని అంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని, అయితే మీ ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేస్తూ పోతే అమలు చేయటం సాధ్యం కాదని జైట్లీ స్పష్టం చేశారని సమాచారం. పన్ను రాయితీల గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఆర్థిక పరిస్థతి ఎంతమాత్రం బాగా లేదనేది మరిచిపోరాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారని అంటున్నారు. జైట్లీ చెప్పినదంతా విన్న యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి, రామమోహన్‌నాయుడు సీఎం చంద్రబాబుతో చర్చించిన తరువాత ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని అదుపుచేయలేని స్థాయికి పెంచి ఇరుక్కుపోయిందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని భావోద్రేకంతో కూడిన అంశంగా మార్చేశారని, ఇప్పుడాయన దానినుండి బైటపడలేక కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించడాన్ని చూస్తే కేంద్రం వైఖరి స్పష్టమైపోతోంది. ఇతర రాష్ట్రాలను కాదని ఏపీకి ఆర్థిక సహాయం చేయటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా బాగా చిక్కిపోయిన రాష్ట్రాలు, సైన్యాన్ని కూడా కాదని ఏపీకి ఆర్థిక సహాయం చేయటం ఎలా సాధ్యమవుతుందని కేంద్రం ప్రశ్నిస్తోంది. కొత్త రాజధాని నిర్మాణానికి ఇంతవరకు రెండున్నర వేల కోట్లు ఇచ్చాం. ఒక్క భవనం కూడా నిర్మించలేదు. ఏమిటిది? అని సదరు మంత్రి నిలదీశారు. లెక్కలు అడగకుండా నిధులిస్తూ పోవటం ఎలా సాధ్యమవుతుందని అటు కేంద్ర ఆర్థిక వర్గాలు కూడా ఏపీని నిలదీస్తున్నాయ.
ఇకమీదట హోదాలు ఉండవు: శుక్లా
రాష్ట్రాలకు ఇక మీదట ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా స్పష్టంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు శుక్లా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు. జీఎస్టీ అమలు నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు కూడా ఇకమీదట ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు, రాయితీలు ఉండవని స్పష్టం చేశారు. పన్ను రాయితీలూ ఇవ్వటం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లోని అన్ని పరిశ్రమలు కేంద్ర, రాష్ట్ర పన్నులు లేదా సమీకృత పన్నులు చెల్లించక తప్పదన్నారు. అయితే 2017 అక్టోబర్ 5న డిఐపిపి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ ఎక్సైజ్ కింద అర్హత ఉన్నవారికి కేంద్ర పన్నుల నుంచి బడ్జెటరీ మద్దతిస్తున్నామని శుక్లా వివరించారు.