జాతీయ వార్తలు

‘హోదా’ పోరు ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీకీ చేందిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ ఎంపీలు వరసగా మూడోరోజూ ఆందోళన కొనసాగించారు. బుధవారం ఉదయం పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ప్లకార్డులను చేతబట్టి నినాదాలిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ మిత్రపక్షంగా ఉన్నందున ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నామని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉండి ఆందోళనలు చేస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇంకా ఏదో చేస్తుందన్న నమ్మకం తమకు లేదని జేసీ మండిపడ్డారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకొవాల్సిన కేంద్రమే బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చేది లేదని బీజేపీ సంకేతాలు ఇస్తోందని మురళీమోహన్ మండిపడ్డారు. ఈ నిరసనలకు మంత్రి గంటా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.
రైతు వేషంలో శివప్రసాద్
ఎంపీ శివప్రసాద్ కావడి పట్టుకుని రైతు వేషధారణతో వచ్చి నిరసన తెలిపారు. ఆ కావడికి రెండు చిన్నపాటి కుండలు కట్టుకుని, ఒక కుండలో మట్టి, మరో కుండలో నీటిని తీసుకువచ్చారు. శివప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఏపీ రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తారనుకుంటే నీరు, మట్టి ఇచ్చారని, ఆ మట్టి, నీరు స్పీకర్ ద్వారా ప్రధానికి తిరిగి ఇచ్చేయడానికి తీసుకొచ్చినట్టు చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న టిడీపీ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఆదుకొంటారని భావించినప్పటికి బీజేపీ ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం చేసిందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్, కే.నారాయణ, కేశినేని నాని, మాగంటి బాబు, పీ.రవింద్రబాబు, గల్లా జయదేవ్, శ్రీరాం మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేష్ పాల్గొన్నారు.
సప్రధాన ద్వారం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ...
ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం పార్లమెంట్ ముఖద్వారం వద్ద ఆ పార్టీ ఎంపీలు వరసగా మూడోరోజూ తమ నిరసనను కొనసాగించారు. విజయసాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరివల్లే ఏపీకి తీవ్రంగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఒకసారి ప్రత్యేక ప్యాకేజీ, మరోసారి ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వైఎస్‌ఆర్‌సీపీ మొదటినుంచీ పోరాటం చేస్తోందని, ఏపీకి న్యాయం చేసేవరకు నిరసనలను కొనసాగిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద రావు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో కేవీపీ నిరసన
విభజన హామీలు నేరవేర్చేవరకు నిరసనను కొనసాగిస్తానని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, న్యాయం చేయాలంటూ ప్లకార్డును ప్రదర్శిస్తూ పార్లమెంట్ అవరణలో కేవీపీ నిరసన తెలిపారు.

chitram...
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎంపీలు, రైతు వేషధారణలో శివప్రసాద్