జాతీయ వార్తలు

హోదాకోసం పార్లమెంట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేతృత్వంలో ‘చలో పార్లమెంట్’ పేరుతో నిర్వహించిన నిరసన బుధవారం కూడా జరిగింది. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన వామపక్ష, హామీల సాధన సమితి కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’, ‘మా హక్కులు మాకివ్వండి’, ‘మోదీ సర్కార్ డౌన్‌డౌన్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతామంతా హోరెత్తింది. దాదాపు గంట సేపు పోలీసులు, ఉద్యమకారులు మధ్య తోపులాట జరిగింది. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పీ.మధు, కే.రామకృష్ణ, సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వీ.శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర యూనివర్శిటీ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని మందిర్‌మార్గ్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు.
chitram...
ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ‘చలో పార్లమెంట్’లో విభజన హామీల సాధన సమితి నేతలు, కార్యకర్తలు