జాతీయ వార్తలు

నీట్‌కు ఆధార్ తప్పనిసరి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: నీట్-2018, అఖిల భారత ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేశారు. ఈ మేరకు సీబీఎస్‌ఈకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం దీనికి సంబంధించిన పిటిషన్ విచారించింది. ఆధార్ నంబర్ తప్పనిసరికాదని స్పష్టం చేసిన బెంచ్ ఈ సమాచారం వెబ్‌సైట్‌లో ఉంచాలని సీబీఎస్‌ఈని ఆదేశించింది. నీట్-2018కు అప్లయి చేసుకునే విద్యార్థులు ఆధార్ నంబర్ కచ్చితంగా పేర్కొనాలన్నదానిపై యూఐడీఏఐ ముందురోజు సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. ఆధార్ తప్పనిసరి కాదని యూఐడీఏఐ బెంచ్‌కు తెలిపింది. జమ్మూకాశ్మీర్, మేఘాలయ, అస్సాం తదితర రాష్ట్రాల్లో వలే ఐడీ ప్రూఫ్‌లుగా పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులు చూపించవచ్చని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. గతంలో నీట్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరి చేశారు. ఇప్పుడా పరిస్థితి తలెత్తదు. నీట్-2018 గడువు మార్చి 9తో ముగియనుంది.