జాతీయ వార్తలు

కర్నాటక లోకాయుక్తపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 7: కర్నాటక లోకాయుక్త జస్టిస్ పీ విశ్వనాథశెట్టిపై బుధవారం ఆయన కార్యాలయంలోనే హత్యాయత్నం జరిగింది. కేసు వాయుదాలపై వాయుదాల పడడంతో విసిగిపోయిన ఓ ఫిర్యాదిదారు శెట్టిపై కత్తితో దాడి చేశారు. ఏకంగా ఐదుసార్లు కత్తితో పొడిచాడు. కత్తిపోట్లతో కుప్పకూలిపోయిన లోకాయుక్తను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జస్టిస్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. దాడి చేసిన తుంకూర్‌కు చెందిన తేజాస్ శర్మ (33) అనే కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశారు. ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేసినా కాలయాపన జరగడంతో ఆగ్రహించిన శర్మ ఆ దారుణానికి పాల్పడ్డాడు. రిజిస్ట్రర్‌లో నమోదు చేయుంచుకుంటానని లోకాయుక్త ఆఫీసులోకి వెళ్లిన తేజాస్ శర్మ ముందే జేబులోంచి కత్తితీసి ఐదు పోట్లు పొడిచాడు. ఐదు నిముషాల తరువాత రక్తపుమడుగులో ఉన్న 75 ఏళ్ల విశ్వనాథశెట్టిని సమీపంలోని మల్లయ్య ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఉపలోకాయుక్త బీ ఆది కార్యాలయంలో లేరని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గ సహచరులతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. శెట్టి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. హోమ్‌మంత్రి రామలింగారెడ్డి, సీటీ డెవలప్‌మెంట్ మంత్రి కేజే జార్జి, నీటిపారుదల మంత్రి ఎంబీ పాటిల్ పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రికి తరలివచ్చారు. విశ్వనాథపై చంపాలని ముందే పథకం వేసుకుని ఆయన చాంబర్‌లోకి ప్రవేశించాడని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆసుపత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకాయుక్తపై దాడిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. భద్రతాపరమైన లోపం ఏమైనా ఉందా అన్న అంశంపై డీజీపీ నీలమణి ఎన్ రాజు విచారిస్తారన్నారు. నిందితుడు శర్మను పోలీసులు అరెస్టుచేశారు. శెట్టిపై దాడిని మాజీ లోకాయుక్త సంతోశ్ హెగ్డే ఖండించారు. ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. అలాగే భద్రతావైఫల్యమేనని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి లోకాయుక్తపై దాడి ఘటనే ఉదాహరణగా ప్రతిపక్ష బీజేపీ వ్యాఖ్యానించింది. లోకాయుక్త ఆఫీసులోకే సరాసరి వెళ్లి దాడికి పాల్పడం షాక్‌కు గురిచేసిందని మాజీ సీఎం యెడ్యూరప్ప అన్నారు. కర్నాటకలో రాష్టప్రతి పాలన విధించాలని మాజీ హోమ్‌మంత్రి ఆర్ అశోక్ డిమాండ్ చేశారు.

chitram...
కత్తిపోట్లకు గురైన కర్నాటక లోకాయుక్త జస్టిస్ పీ విశ్వనాథశెట్టిని ఆసుప్రతికి తరలిస్తున్న దృశ్యం.