జాతీయ వార్తలు

బలగాల్లో తగిన ప్రాతినిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, జనవరి 6: జనాభాలో మహిళల శాతానికి అనుగుణంగా వారు వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందలేక పోతున్నారనేది వాస్తవమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంగీకరించారు. అయితే దేశ పోలీసు బలగాలలో తగినంత మంది మహిళలకు ఉద్యోగాలు, సరయిన సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను చెప్పినదానికీ, చేసినదానికీ తేడా ఉండదన్నారు. సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్ వంటి కేంద్ర పారా మిలటరీ బలగాలలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలలో 33 శాతం మంది మహిళలకు, బిఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బి, ఐటిబిపి వంటి సరిహద్దు కాపలా బలగాలలో 15 శాతం మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తమ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడి సిఆర్‌పిఎఫ్ అకాడెమీలో బుధవారం నిర్వహించిన పోలీసు శాఖలోని మహిళా ఉద్యోగుల ఏడవ జాతీయ సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో పోలీసు బలగాల్లో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లభిస్తుందని హామీ ఇస్తున్నానని, అయితే తాను దీనిని రిజర్వేషన్ అని పిలవబోనని స్పష్టం చేశారు. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్ర పోలీసు సంస్థలకు, బలగాలకు ఆదేశాలు జారీ చేసిందని, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తగిన సూచనలు చేసిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మహిళలకు సమాన హోదానే కాకుండా పురుషులకన్నా ఎక్కువ హోదాను కల్పించిన దృష్టాంతాలు అనేకం భారతీయ చరిత్ర, సంస్కృతిలో కనిపిస్తాయని మంత్రి అన్నారు. తాము గర్వించదగిన, పటిష్ఠమైన భారత్‌ను కోరుకుంటున్నామని, జనాభాలో సగం మంది ఉన్న మహిళలను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించలేమని అన్నారు. లింగ సమానత్వాన్ని సమర్థిస్తానని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపిలో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించానని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

గుర్గావ్‌లోని సిఆర్‌పిఎఫ్ అకాడెమీలో బుధవారం నిర్వహించిన సదస్సులో మహిళా పోలీసు ఉద్యోగులతో రాజ్‌నాథ్ సింగ్