జాతీయ వార్తలు

తమిళ ప్రజలకు జయ ‘పొంగల్’ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్ర ప్రజలకు పొంగల్ కానుకను ప్రకటించారు. రేషన్ కార్డులు కలిగివున్న 1.91 కోట్ల మందికి ప్రజా పంపిణీ పథకం కింద కిలోబియ్యం, పంచదార, రెండు చెరకుగడలు అందచేస్తారు. అంతేకాకుండా కార్డుకు వంద రూపాయల నగదు పంపిణీ చేస్తామని అన్నాడిఎంకె అధినేత్రి వెల్లడించారు. ‘బియ్యం కార్డుదారులందరికీ సంక్రాంతి కానుకగా గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉంది. పోలీసు కార్డు యజమానులు, పునరావాస శిబిరాల్లో ఉంటున్న శ్రీలంక తమిళ కుటుంబాలకు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ కానుక ఇవ్వనున్నాము’ అని జయలలిత స్పష్టం చేశారు. ఒక్కో కార్డుకు కిలో బియ్యం, పంచదార, సంక్రాంతి పండుగ సూచకంగా వినియోగించే చెరకుగడలు (2 అడుగులవి రెండు), 100 రూపాయల నగదు అందజేస్తామని ఆమె తెలిపారు. చౌకడిపో దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నట్టు ఒక ప్రకటనలో చెప్పారు. కోతల పండగగా పిలిచే సంక్రాంతిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జయ పేర్కొన్నారు. సంక్రాంతి గిఫ్ట్ పథకానికి 318 కోట్ల రూపాయలు వ్యయం కానుంది. రెండు లక్షల మంది పేదలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విజయోత్సవ ర్యాలీలతో జనంలోకి...
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార అన్నాడిఎంకె ఎన్నికల వ్యూహాలకు ఇప్పటినుంచే పదును పెడుతోంది. ఇందులో భాగంగా బుధవారం విజయోత్సవ ర్యాలీలకు అట్టహాసంగా శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు అన్నాడిఎంకె ‘అమ్మ పెరవాయ్’ విభాగం నేతృత్వంలో రాష్టవ్య్రాప్తంగా ర్యాలీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 65,616 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 5.62 కోట్ల ఓటర్లను ఆకట్టుకోవడం ఈ ర్యాలీల లక్ష్యం. 2011లో అధికారంలోకి వచ్చిన అన్నాడిఎంకె చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలను ప్రజలకు తెలియపరచి రానున్న ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం అందించడమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కదం తొక్కనున్నారు. చెన్నైలో బుధవారం అన్నాడిఎంకె ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదనన్, చెన్నై మేయర్ సైదాయ్ దురైసామి ఈ ర్యాలీలను ప్రారంభించారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై కరూర్‌లో ర్యాలీని ప్రారంభించారు.
అలాగే రాష్టవ్య్రాప్తంగా అమ్మా పెరవాయ్ విభాగం చెందిన నాయకులు, మంత్రులు, ఎంపీలు, మేయర్లు, ఎమ్మెల్యేలు ర్యాలీలను రాష్టవ్య్రాప్తంగా ప్రారంభించారు.