జాతీయ వార్తలు

కాశ్మీరులో గవర్నర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/శ్రీనగర్, జనవరి 9: జమ్మూ-కాశ్మీర్‌లో శనివారం రాత్రి గవర్నర్ పాలన విధించారు. ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మరణం అనంతరం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో గవర్నర్ పాలన విధించినట్లు కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఢిల్లీలో వెల్లడించారు. జమ్మూ-కాశ్మీరులో గవర్నర్ పాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్.వోహ్రా చేసిన సిఫారసు ఆధారంగా కేంద్ర హోం శాఖ చేసిన సిఫారసును రాష్టప్రతి ఆమోదించారు. పిడిపి శాసనసభా పక్షానికి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ కుమార్తె మెహబూబా ముఫ్తీ ఇప్పటికే గవర్నర్‌కు తెలియజేశారు. అయితే సంతాప కాలంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆమె విముఖతను వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాల్సి వచ్చింది. ఇంతకుముందు జమ్మూ-కాశ్మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన 79 ఏళ్ల ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ స్వల్ప అస్వస్థతతో గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన వెలితి ఏర్పడింది.
అయితే రాష్ట్రంలో నాలుగు రోజుల సంతాప దినాలు ఆదివారం ముగిశాక నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తాము నిర్ణయం తీసుకుంటామని పిడిపి సంకీర్ణ భాగస్వామి అయిన బిజెపి కూడా తెలిపింది. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయమై షరతుల ప్రస్తావనే రాలేదని ఇటు బిజెపితో పాటు అటు పిడిపి కూడా స్పష్టం చేసింది. ‘మా వైపు నుంచి ఎటువంటి షరతులు లేవు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయమై మా నాయకులు అసలు సమావేశమే కాలేదు. ముఫ్తీ సాహెబ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఆయన కుటుంబానికి గల హక్కును మేము గౌరవిస్తున్నాం’ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సత్పాల్ శర్మ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ నుంచి తనకు లేఖ అందిందని, దీనిపై తొందరేమీ లేదని, ఆదివారం సంతాప కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ అంశంపై బిజెపి నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బిజెపి, పిడిపి సంకీర్ణం చరిత్రాత్మకమైనదని, దీనిని కొనసాగించాలని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయమై అటు బిజెపి గానీ ఇటు తమ పార్టీ గానీ ఎటువంటి షరతులు విధించలేదని పిడిపి సీనియర్ నాయకుడు, విద్యా శాఖ మాజీ మంత్రి నరుూమ్ అక్తర్ కూడా స్పష్టం చేశారు. ‘తండ్రి మరణంతో సంభవించిన భారీ నష్టం నుంచి మెహబూబా ఇప్పటికీ కోలుకోలేదు. ముఫ్తీ సాహెబ్ ఆమెకు కేవలం తండ్రి మాత్రమే కాదు.. మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత కూడా. ప్రస్తుతం మేము ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించే స్థితిలో లేము. కనుక షరతుల ప్రస్తావన ఎలా వస్తుంది?’ అని ఆయన పేర్కొంటూ, ప్రభుత్వ ఏర్పాటుపై తమ పార్టీ నాయకత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.