జాతీయ వార్తలు

అవ్యవస్థీకృత కార్మికులకు ‘యు-విన్’ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంషెడ్పూర్, జనవరి 9: సామాజిక పథకాలు, ప్రయోజనాలు పొందడానికి వీలుగా అవ్యవస్థీకృత రంగంలో పని చేసే కార్మికులకు ఒక ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబరును జారీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వీలయినంత త్వరలో దేశంలోని అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యు-విన్ కార్డు) పేరుతో ఒక స్మార్ట్‌కార్డును జారీ చేయాలని మేము యోచిస్తున్నాం’ అని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారు పిపి మిత్రా శనివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. దాదాపు 40 కోట్ల మంది కార్మికుల్లో 93 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మిత్రా చెప్పారు. అందువల్ల దీనికి సంబంధించి ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దీన్ని అమలు చేయడానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడం జరుగుతుందని ఆయన చెప్పారు. పెన్షన్ పథకం, వృద్ధాప్య పథకం లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను యు-విన్ కార్డులకు అనుసంధానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో నేషనల్ సర్వీస్ కెరీర్ పోర్టల్‌ను ప్రారంభించింది. దేశంలోని ఉపాధి కల్పనా కేంద్రాల్లో ఉపాధి కోసం రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఈ కెరీర్ పోర్టల్‌లోకి తీసుకు రావడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి కల్పనా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకున్నారని, పరిశ్రమలు తమ అవసరానికి తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి ఈ పోర్టల్ తోడ్పడుతుందని తెలిపారు. ఇప్పటివరకు 9 లక్షల మంది యజమానులు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారని కూడా ఆయన చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అవగాహనను, నైపుణ్యాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉందని కూడా మిత్రా స్పష్టం చేసారు.