జాతీయ వార్తలు

దెబ్బకు దెబ్బే జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: పాకిస్తాన్‌తో భారత్ చర్చలు జరపాల్సిందేనని, అయితే తమ గడ్డపై జరిగే ఉగ్రవాద దాడులకు తగిన రీతిలో సమాధానం చెప్పడం కూడా జరగాలని యోగా గురువు బాబా రామ్‌దేవ్ అన్నారు. ‘ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు ‘దెబ్బకు దెబ్బ’ అన్న రీతిలో సమాధానం చెప్పాలి. వాళ్లు మన వాళ్లను ఇద్దర్ని చంపితే మనం పదిమందిని వాళ్ల వాళ్లను హతమార్చాలి. అదే సమయంలో శాంతి చర్చలు కొనసాగాలి. మనం శాంతి మార్గాన్ని అనుసరించడంతోపాటు విశాల హృదయాన్ని, ధైర్య సాహసాలను కూడా ప్రదర్శించాలి’ అని శనివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రామ్‌దేవ్ అన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా దేశ ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతిన్నదని, అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్‌పై కొన్ని కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు. ‘్భరత దేశం బలహీనంగా లేదు, అంతేకాదు మనం ఎవరికీ భయపడ్డం లేదు. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దేశ నైతిక స్థైర్యం దెబ్బతిన్నది. అందువల్ల పాకిస్తాన్‌పై కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అన్నారు.
రామందిర అంశంపై మాట్లాడుతూ, మహమ్మదు ప్రవక్త అయోధ్యలో జన్మించలేదని మొత్తం ప్రపంచానికి తెలుసునని, అందువల్ల ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని రామ్‌దేవ్ అన్నారు. శ్రీరాముడు దేశానికి ఆదర్శమని, అందువల్ల దేశ ప్రతిష్ఠ విషయంలో వివాదాలు సరికాదని కూడా ఆయన అన్నారు. ‘్భరతీయులు రాముడ్ని ఆదర్శంగా భావిస్తారు. ఆయన దేశానికే గర్వకారణం. అందువల్ల రామమందిరం సమస్యను రాజకీయం చేయరాదు. దేశానికి ఆదర్శంగా భావించే శ్రీరాముడి విషయంలో ఎలాంటి వివాదం ఉండరాదు. మహమ్మదు ప్రవక్త అయోధ్యలో జన్మించలేదని, రాముడు జన్మించాడనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని ఆయన అన్నారు. దేశంలో మత అసహనం లేదని, అయితే ఆలోచనలు, సిద్ధాంతాల పట్ల అసహనం ఉందని రామ్‌దేవ్ అన్నారు. ఈ అసహనం అంతమైతే అప్పుడు దేశంలో పూర్తి శాంతి నెలకొంటుంది. రాజ్యాంగం మనకు కొన్ని వౌలిక హక్కులను ఇచ్చింది. వాటిద్వారా మనం మన వాణిని వినిపించవచ్చు. ఆ గొంతును నులమడమే ఆలోచనలు, రాజకీయాల అసహనం అని ఆయన అన్నారు.
దెబ్బకు దెబ్బే జవాబురాజీవ్ మద్దతిచ్చారు