జాతీయ వార్తలు

‘స్వచ్ఛ భారత్’ పురోగతిపై సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: స్వచ్ఛ భారత్ మిషన్ పురోగతిపై విస్తృత సర్వే నిర్వహించడానికి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో ఈ పథకం అమలవుతున్న దేశంలోని 75 నగరాలకు ర్యాంకులు ఇవ్వడానికి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యుసిఐ)కు ఆ బాధ్యతను అప్పగించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం తొలిసారిగా నిర్వహించే ఈ సర్వేను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుందని, దానికి ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌‘ అని పేరు పెట్టినట్లు క్యుసిఐ ఒక ప్రకటనలో తెలియజేసింది. అన్ని రాష్ట్రాల రాజధానులు, పదిలక్షలకు పైబడిన జనాభా ఉన్న మరో 53 నగరాల్లో ఈ సర్వే జరుగుతుందని ఆ ప్రకటన తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభం కావడానికి ముందు గత ఏడాది బేస్ ఇయర్ సర్వేను నిర్వహించారు. ఈ 75 నగరాలు సాధించిన పురోగతిని కొలవడానికి, తదనుగుణంగా ర్యాంకులు ఇవ్వడానికి ప్రస్తుత సర్వేలో 2015 డిసెంబర్ నాటివరకు సాధించిన పురోగతిని, 2014 అక్టోబర్ సర్వేలోని అంశాలతో పోల్చి చూడడం జరుగుతుందని ఆ ప్రకటన తెలిపింది. జనవరి 5 నుంచి 20 తేదీల మధ్య కాలంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌ను నిర్వహిస్తారు. ఈ నెల 25న ప్రభుత్వ వెబ్‌సైట్ ‘మై గవ్’లో ఫలితాలను ప్రకటిస్తారు. 2019 నాటికి పట్టణ ప్రాంతాల్లోని మొత్తం 83 వేల వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం, మున్సిపాలిటీలలోని ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్మూలించేలా చూడడం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అనే విషయం తెలిసిందే. అందువల్ల పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుకోసం రూపొందించిన వ్యూహాల్లో సాధించిన పురోగతిని ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అంచనా వేస్తారు. ‘75 నగరాల్లో పరిశుభ్రత స్థాయిని అంచనా వేయడానికి, ఆయా నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ఈ సర్వే తోడ్పడుతుంది. మున్సిపాలిటీలు, ప్రజలు ఎంత చురుగ్గా పాల్గొంటారనే దానిపై ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ విజయం ఆధారపడి ఉంది. అందువల్ల ఈ సర్వేను విజయవంతం చేయడానికి దీనిలో పాల్గొనాలని ప్రజలను, మున్సిపాలిటీలను ఆహ్వానిస్తున్నాం’ అని క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిల్ జైనుల్‌భాయ్ చెప్పారు.

ఆర్య-వైశ్య యువత ఆధ్వర్యంలో శనివారం వారణాసిలోని అస్సీ ఘాట్‌లో
నిర్వహించిన క్లీన్ ఇండియా మిషన్ కార్య క్రమంలో పాల్గొన్న కార్యకర్తలు