జాతీయ వార్తలు

18 నుంచి బెంగాల్‌లో బిజెపి ప్రచార భేరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 9: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో భారీ ప్రచార కార్యక్రమానికి బిజెపి శ్రీకారం చుట్టుబోతోంది. కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు ఈ నెలలోనే భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న మాల్దాలో జరిగే గడ్కరీ ర్యాలీతో బిజెపి ప్రచార కార్యక్రమం మొదలవుతుందని, 21న బరాసత్ బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్, 22న బర్ద్వాన్‌లో స్మృతి ఇరానీ మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
25న హౌరాలో జరిగే ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలతోపాటు అన్ని రకాల ప్రచార ప్రక్రియను చేపడతామని స్పష్టం చేశాయి. అరుణ్ జైట్లీ రాష్ట్ర నేతలతో శుక్రవారం జరిపిన సమావేశంలో ప్రచార కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నారు.

రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లో దేనితోనూ ఎన్నికల పొత్తుపెట్టుకునేది లేదని జైట్లీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీలపై ఆధారపడకుండా తన సొంత ఉనికిని చాటుకునే లక్ష్యంలోనే బిజెపి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.