జాతీయ వార్తలు

అభినవ ఏకలవ్యుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 10: మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచారుడికి గురుదక్షిణ కింద తన బొటనవేలును నరికి ఇచ్చిన కథ అందరికీ తెలిసిందే. కర్నాటకలో ఓ ఆధునిక ఏకలవ్యుడు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బెయిలు లభించినందుకుగాను తన చిటికెన వేలును నరికి తిరుపతి వెంకటేశ్వరుడికి కానుకగా సమర్పించుకున్నాడు. బెంగళూరు సమీపంలోని రామనగరకు చెందిన ఇందువల సురేశ్ అనే 35 ఏళ్ల యువకుడు గత నెల 25న తిరుపతి వెంకన్న ఆలయానికి వెళ్లి తన చిటికెన వేలును వెయ్యి రూపాయల నోటులో చుట్టి ఆలయంలోని హుండీలో వేసాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక పేర్కొంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఉండింది. అందుకే నేను ఈ కేసులో సోనియా, ఆమె కుమారుడు రాహుల్‌కు బెయిలు లభిస్తే నా చిటికెన వేలును కానుకగా ఇస్తానని మొక్కుకొన్నాను’ అని సురేశ్ చెప్పాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా కర్నాటక హౌసింగ్ మంత్రి ఎంహెచ్ అంబరీష్ చెవిన పడడంతో ఆయన సురేశ్‌ను జెపి నగర్‌లోని తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు.