జాతీయ వార్తలు

దత్తత స్వీకారంలో బాలికలకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: లింగ వివక్ష తీవ్రంగా కొనసాగుతున్న మన దేశంలో ఇది ఆహ్వానించదగిన పరిణామం. పిల్లలను దత్తత తీసుకునేవారు మాత్రం బాలురకన్నా బాలికలను దత్తత తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో స్ర్తి, పురుష నిష్పత్తిలో మార్పులు చోటుచేసుకుంటూ, జనాభాలో స్ర్తిల శాతం రానురాను తగ్గుతుండటంపై ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పిల్లలను దత్తత తీసకుంటున్నవారు బాలికలకే ప్రాధాన్యం ఇవ్వడం సానుకూల పరిణామంగా సంతరించింది. గత మూడేళ్లలో 7,439 మంది బాలికలను దత్తత తీసుకోగా, 5,167 మంది బాలురను మాత్రమే దత్తత తీసుకున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు దత్తత సంస్థలు, ఇతర భాగస్వామ్య సంస్థల నుంచి కొత్త దత్తత మార్గదర్శకాల పట్ల ప్రతిస్పందనకు సంబంధించి అందిన వివరాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం దేశంలో 2012-13 సంవత్సరంలో 2,846 మంది బాలికలను దత్తత తీసుకోగా, 1,848 మంది బాలురను దత్తత తీసుకున్నారు. 2013-14 సంవత్సరంలో 2,293 మంది బాలికలను దత్తత తీసుకోగా, 1,631 బాలురను దత్తత తీసుకున్నారు. 2014-15లో 2,300 మంది బాలికలను దత్తత తీసుకోగా, 1,688 మంది బాలురను దత్తత తీసుకున్నారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా
బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
న్యూఢిల్లీ, జనవరి 10: భారతదేశ వారసత్వ సాంస్కృతిక చారిత్రక సాంప్రదాయక వైభవానికి అద్దంపట్టే ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారానికి తదుపరి సారథి ఎవరనే దానిపై ఊహాగానాలు విస్తృతమవుతున్నాయి. కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ పరిశీలనలో అనేకమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నిష్క్రరించడంతో ఎవరిని ఎంపిక చేయాలా అనేది అంతుబట్టడం లేదు. క్రీడారంగం సహా అనేక రంగాలకు చెందిన సెలబ్రిటీల పేర్లు టూరిజం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. ‘అతిథి దేవోభవ’ కార్యక్రమానికి మహిళనే సారథిగా నియమించాలని, దీనివల్ల విదేశీ టూరిస్టులను ఆకర్షించడం సాధ్యమవుతుందని నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేదు. ఈ సలహాలు సూచనలు అన్నింటినీ పరిశీలించిన అనంతరం బ్రాండ్ అంబాసిడర్ పేరును ప్రకటిస్తామని టూరిజం శాఖ వెల్లడించింది.

యూరప్ నుంచి
తిరిగొచ్చిన రాహుల్

న్యూఢిల్లీ, జనవరి 10: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం తన యూరప్ పర్యటననుంచి తిరిగివచ్చారు. తాను లేని సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోవడానికి ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమవుతారు. గతంలో రాహుల్ విదేశీ పర్యటనలు అనేక ఊహాగానాలకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన తన ఐరోపా పర్యటన గురించి గత నెల 28న ట్విట్టర్‌లో స్వయంగా తెలియజేసారు. కొద్ది రోజుల కోసం తాను యూరప్ వెళ్తున్నానని, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు.
రాహుల్ గాంధీ ఈ రోజు తెల్లవారుజామున వచ్చారని, సోమవారం పార్టీ నేతలను కలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.