జాతీయ వార్తలు

విద్యాప్రమాణాలు కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, జనవరి 10: దేశంలో రోజురోజుకు విద్యాప్రమాణాలు పడిపోవడాన్ని నివారించాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. విద్యాప్రమాణాలు పడిపోవడాన్ని నిరోధించడమే కాకుండా విద్యావేత్తలు, విధాన నిర్ణయాలు తీసుకునేవారు, ఇతర భాగస్వామలు విద్యానాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యానాణ్యతను పెంపొందించడానికి పలు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. నిపుణులయిన విద్యాబోధకులను ఆకర్షించడం ఇందులో ఒకటని ఆయన చెప్పారు. దీనితోపాటు పరిశ్రమ, పరిశోధనా సంస్థలకు చెందిన వారితో విద్యాబోధన చేయిస్తే విద్యార్థుల్లో వారు అభ్యసిస్తున్న కోర్సుల ఆచరణాత్మక దృక్పథాన్ని పెంపొందించవచ్చని ఆయన సూచించారు.
ఆదివారం ఇక్కడ రాష్టప్రతి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (బిట్) మెస్రా 75వ వార్షికోత్సవాన్ని, 26వ స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనా పార్కులను నెలకొల్పి, తాజా ఆధునిక పరిశోధనలను అధ్యయనం ద్వారా అవగాహన చేసుకొని ముందుకు సాగితే, అది మన విద్యాసంస్థల్లో ప్రపంచ స్థాయి అనుసంధాన విద్యావ్యవస్థలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని వివరించారు. మన విద్యాసంస్థలు విదేశీయ, దేశీయ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఇతరులకన్నా ముందే వివిధ సృజనాత్మక కార్యక్రమాలకు అంకురార్పణ చేయడానికిగాను స్టార్టప్‌లను వేగిరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత్‌లో అనేక స్టార్టప్‌లు విజయవంతం అవడంతోపాటు ఇతరులకు ప్రగతి పథాన్ని చూపిస్తున్నాయని ఆయన వివరించారు. వాస్తవానికి భారత్ 4,200లకు పైగా స్టార్టప్‌లతో ప్రపంచంలో అమెరికా, బ్రిటన్‌ల తరువాత మూడో స్థానంలో ఉందని రాష్టప్రతి వెల్లడించారు.
ఎన్‌బిబిఎస్‌ఎస్‌తో అనుబంధం
నిఖిల్ భారత్ బంగా సాహిత్య సమ్మేళన్ (ఎన్‌బిబిఎస్‌ఎస్)తో సుమారు మూడు దశాబ్దాలుగా తనకున్న అనుబంధాన్ని రాష్టప్రతి గుర్తుచేసుకున్నారు. 1922లో ‘ప్రోబసి బంగా సాహిత్య సమ్మేళన్’ పేరుతో స్థాపితమైన ఈ సంస్థ తొలి వార్షికోత్సవం 1923లో వారణాసిలో రబీంద్రనాథ్ ఠాగూర్ అధ్యక్షతన జరిగింది. ఆదివారం ఇక్కడ రాష్టప్రతి ఎన్‌బిబిఎస్‌ఎస్ 88వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ సాహిత్య సంస్థతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. 19వ శతాబ్దం మధ్య కాలంలో బెంగాలీ సాహిత్యంలో నవలలు పరిచయం అయ్యాయని ఎన్‌బిబిఎస్‌ఎస్‌కు 12సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
chitram...

రాంచీలో ఆదివారం బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి స్నాతకోత్సవంలో
ఓ విద్యార్థికి డిగ్రీ పట్టా ప్రదానం చేస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ