జాతీయ వార్తలు

సామరస్యం కొరవడితే అభివృద్ధి పూజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, జనవరి 12: పరస్పర సంప్రదాయాలు, మనోభావాలను గౌరవించుకున్నప్పుడే శాంతి, సమైక్యత, సామరస్యం పెంపొందుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ రకమైన పరిస్థితి ఏమాత్రం కొరవడినా అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించారు. వైవిధ్యమే భారతదేశ అంతర్గత శక్తి అని, సామరస్యం దీన్ని మరింత బలోపేతం చేసే సుగుణమని ప్రధాని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ యువజనోత్సవాలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ శాంతి, సమైక్యత, సామరస్యాలే భారతావనికి వనె్న తెస్తాయని తెలిపారు. భారతదేశాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని వెల్లడించారు. సామరస్యాన్ని పరిరక్షించుకోకపోతే సమత, మమతలను కాపాడుకోకపోతే ఏవిధమైన పురోగతి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఒకరి సంప్రదాయాలను, మనోభావాలను మరొకరు గౌరవించుకోవడమే సామరస్యమని, అది కొరవడితే విధ్వంసమే చోటుచేసుకుంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, సమైక్యత, సామరస్యాలే ఏ దేశ అభివృద్ధికైనా తిరుగులేని కొలమానాలని వెల్లడించారు. స్వామి వివేకానంద నాలుగు రోజుల జయంతి కార్యక్రమం సందర్భంగా యువతనుద్దేశించి మోదీ ప్రసంగించారు. వందలాది భాషలు, భిన్నమైన మతాలు ఉన్నా ఏకత్వ భావనతో శాంతియుత పరిస్థితుల్లో జీవించగలమన్న నిరుపమాన లక్షణాన్ని ప్రపంచ దేశాలకు భారతావని చాటిచెప్పిందన్నారు. ‘ఇదీ మన సమున్నత సంస్కృతి. ఈ ఉదాత్త పరిస్థితుల్లోనే ప్రతి భారతీయుడు పెరిగాడు. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వివేకానందుడి ప్రవచనాలను ఉటంకించారు. దేశంలో మత అసహన పరిస్థితులు తీవ్రమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో సమైక్యతే సర్వస్వమని, సామరస్యమే భారతీయతకు పునాది అని మోదీ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చిత్రం.. జాతీయ యువజనోత్సవాలను ఉద్దేశించి వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ