జాతీయ వార్తలు

కరవు కష్టం తీరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: తెలంగాణకు కరవు సాయం గురువారం ప్రకటించనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి హరీశ్‌రావుకు హామీ ఇచ్చారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, తాను, ఇతర మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం మధ్యాహ్నం సమావేశం కానున్నట్టు మంత్రి వెల్లడించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కె ప్రభాకర్ రెడ్డి గురువారం రాధామోహన్ సింగ్, ఎరువుల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, నీటిపారుదల మంత్రి ఉమాభారతిని కలిసి తెలంగాణకు సంబంధించిన ఏడు ముఖ్యాంశాలపై చర్చలు జరిపారు. హరీశ్‌రావు తొలుత రాధామోహన్ సింగ్‌తో సమావేశమై తెలంగాణలో నెలకొన్న కరవు, కేంద్రం అందించాల్సిన సాయంపై చర్చించారు. రాష్ట్రానికి కరవు సాయం అందించటం ఇప్పటికే ఆలస్యమైందన్న భావన, ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు దృష్టా కనీసం 1500 కోట్ల సాయం అందించాలని రాధామోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్రం అందించే సాయం ఇంతకంటే తక్కువుంటే కష్టమవుతుందని వివరించారు. మిల్క్ గ్రిడ్ కార్యక్రమం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలు, చిన్న సన్నకారు రైతులు, ఇతరులు పాడి పశువులను కొనుగోలు చేసేందుకు ఇవ్వాల్సిన సబ్సిడీని నాబార్డ్ ద్వారా ఇవ్వాల్సింది ఇవ్వటం లేదు. ఈ ఖాతా కింద దాదాపు వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని రాధామోహన్ సింగ్‌ను కోరినట్టు హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణలో 1024 కోట్ల రుణాన్ని నాబార్డ్ నుంచి తీసుకుని గోదాములు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ నిర్మాణాలకు కేంద్రం ఇవ్వాల్సిన రాయితీని తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. గురువారం మధ్యాహ్నం జరుగనున్న ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో కరవు సాయాన్ని నిర్ణయిస్తామని రాధామోహన్ సింగ్ తనతో చెప్పారని హరీశ్‌రావు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను శాస్ర్తియ పద్ధతులలో నిలువ ఉంచడానికి గిడ్డంగుల నిర్మాణం చేపడితే 17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంగల 330 గిడ్డంగులను నిర్మించడానికి రూ. 1000 కోట్ల ఆర్థిక సహాయం కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కేంద్రానికి రాసిన లేఖను మంత్రి హరీశ్‌రావు కేంద్ర మంత్రికి అందజేశారు. వీటి నిర్మాణానికి మొత్తంగా రూ. 1024 కోట్ల ఖర్చు కానుండగా, ఇందులో రూ. 972.79 కోట్ల రుణాన్ని నాబార్డ్ నుండి తీసుకోవడానికి ప్రతిపాదనలు రూపొందించినట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు కేంద్రం ఇవ్వవలసిన రాయితీని తెలంగాణా ప్రభుత్వానికి విడుదల చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. రేపు మధ్యాహ్నం జరుగనున్న ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో కరువు సహాయాన్ని నిర్ణయిస్తామని రాధామోహన్ సింగ్ తనతో చెప్పారని హరీష్ రావు వెల్లడించారు. ఇలా ఉండగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడునున్న గిడ్డంగుల మొదటి విడత నిర్మాణాలను మార్చిలో, జూన్, జూలైలో రెండవ దశ నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు.
తెలంగాణకు వస్తాను
మిషన్ కాకతీయ కింద చేపడుతున్న రెండో దశ పనులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అంగీకరించారు. మిషన్ కాకతీయ రెండోదశ పనుల ప్రారంభానికి రావాలని హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తిని వెంటనే ఆమోదించారు. భగీరథ పథకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. అయితే, రాష్ట్రానికి సంబంధించిన మూడు అంశాలు కేంద్ర జలవనరుల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు హరీశ్ వివరించారు. దేవాదుల ప్రాజెక్టుకు గత మూడేళ్లుగా ఏఐబిపి కింద రావాల్సిన 297 కోట్లను వెంటనే విడుదలు చేయాలని ఉమాభారతిని కోరినట్టు హరీశ్ రావు చెప్పారు. ఇదేవిధంగా మిషన్ కాకతీయ కింద చేపట్టిన 900 చెరువుల పునరుద్ధరణకు 431 కోట్లు వెంటనే విడుదలు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. వరద కాల్వను 1992-93లో ప్రారంభించారు, దీనికి సంబంధించి సవరించిన అంచనాలను కేంద్ర జల సంఘం ద్వారా జలవనరులనుల శాఖకు పంపించాం. ఈ సవరించిన అంచనాలకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఉమాభారతిని కోరినట్టు హరీశ్ రావు వివరించారు. మూడు పథకాలకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్క జొన్నల సేకరణకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన 212 కోట్ల హ్యాండ్లింగ్ చార్జీలను విడుదలు చేయించాలని కేంద్ర ఎరువుల శాఖ రాంవిలాస్ పాశ్వాన్‌ను కోరినట్టు చెప్పారు. వారం పది రోజుల్లో సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని రాంవిలాస్ పాశ్వాన్ హామీ ఇచ్చారని హరీశ్‌రావు చెప్పారు. తాను పది పదిహేను రోజుల తరువాత మరోసారి ఢిల్లీకి వచ్చి సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తానని ఆయన తెలిపారు.

చిత్రం... తెలంగాణలో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, కరవు సాయం తక్షణం ప్రకటించి ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌కు వినతి పత్రం ఇస్తున్న మంత్రి హరీశ్