జాతీయ వార్తలు

టికెట్‌కు ఎసరుతెచ్చిన పాదాభివందనం ఫొటో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగఢ్, జనవరి 13: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరుగనున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఆత్రౌలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సంగీతా చౌదరికి ఇచ్చిన టికెట్‌ను బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి రద్దు చేశారు. సంగీతా చౌదరి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారనే అభియోగంపై ఆమెకు ఇచ్చిన టికెట్‌ను రద్దు చేశారు. మాయావతి కాళ్లకు తాను, తన పిల్లలు మొక్కుతున్న ఒక ఫొటోను సంగీతా చౌదరి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన తరువాత మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. సంగీతా చౌదరి పిల్లలతో కలిసి తనకు పాదాభివందనం చేస్తున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం పట్ల ఆగ్రహంతోనే మాయావతి ఆమెకు కేటాయించిన టికెట్‌ను రద్దు చేసినట్లు భావిస్తున్నారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందున సంగీతా చౌదరికి కేటాయించిన టికెట్‌ను రద్దు చేసినట్లు బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు అరవింద్ ఆదిత్య ప్రకటించారు. అయితే అంతకుమించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. సంగీత భర్త ధర్మేంద్ర చౌదరి గతంలో ఆత్రౌలి నుంచి పోటీ చేశారు. 2015 జనవరిలో ఆయన హత్యకు గురికావడంతో ఆ స్థానంలో సంగీతకు టికెట్ కేటాయించారు. మాయావతికి పాదాభివందనం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేయడంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, పార్టీ అధినేత్రి తనకు అండగా ఉన్నారని, తన విజయం ఖాయమని ప్రత్యర్థులకు చెప్పడానికే అలా చేశానని సంగీత వివరించారు. ఈ విషయంలో పార్టీ అధినేత్రికి తాను క్షమాపణలు చెబుతానని ఆమె అన్నారు.