జాతీయ వార్తలు

రాజ్యాంగ ధర్మాసనానికి అరుణాచల్ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: అరుణాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి సంబంధించి గౌహతి హైకోర్టు జారీ చేసిన కొన్ని ఉత్తర్వులపై దాఖలయిన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. గవర్నర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ సి నాగప్పన్‌లతో కూడిన బెంచ్ తెలిపింది. ఈ వ్యవహారాన్ని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారించాలని సుప్రీంకోర్టు చేసిన సూచనకు 14 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు కలిసి స్పీకర్‌ను పదవినుంచి తొలగించిన నబమ్ రెబియా, గవర్నర్, డిప్యూటీ స్పీకర్ తరఫు న్యాయవాది అంగీకరించారు. ఈ వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు బెంచ్ ప్రకటించిన వెంటనే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఫ్‌ఎస్ నారిమన్, కపిల్ సిబల్, హరీష్ సాల్వే తదితర సీనియర్ న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ కోర్టుకు హుటాహుటిన వెళ్లి ఈ వ్యవహారం అత్యంత సున్నితమైనది, వీలయినంత త్వరగా పరిష్కరించాల్సినది అయినందున వెంటనే ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
కాగా, ఈ నెల 18 దాకా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించరాదని బెంచ్ బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన పరిపాలనా సంబంధ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి కూడా బెంచ్ రెబియాను అనుమతించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తన పిటిషన్‌ను తప్పుగా తోసిపుచ్చారని, న్యాయపరంగా విధులను నిర్వహించడంలో విఫలమయ్యారని తనను స్పీకర్ పదవినుంచి తప్పించడంతోసహా గవర్నర్, డిప్యూటీ స్పీకర్ తీసుకున్న పలు నిర్ణయాలను రెబియా పిటిషన్‌లో సవాలు చేశారు. డిసెంబర్ 16న ఇటానగర్‌లోని ఓ కమ్యూనిటీ హాలులో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన 14 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బిజెపి ఎమ్మెల్యేలు కలిసి రెబియాను స్పీకర్ పదవినుంచి తొలగించిన విషయం తెలిసిందే.
స్పీకర్‌ను తొలగించడానికి ముందు డిప్యూటీ స్పీకర్ 14 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతను కూడా కొట్టివేశారు. అనంతరం గవర్నర్, డిప్యూటీ స్పీకర్ తీసుకున్న పలు నిర్ణయాలను రెబియా గౌహతి హైకోర్టులో సవాలు చేయగా, ఫిబ్రవరి 1 దాకా ఆ నిర్ణయాలను నిలిపివేస్తూ కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. 1