జాతీయ వార్తలు

సోషల్ మీడియాపై నిరంతర నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాల్లోని మైనారిటీ యువత ఐసీస్‌కు ఆకర్షితులు కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోలీసు, నిఘా సంస్థల అధిపతులు ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఐసీస్ కుట్రలు, అరికట్టేందుకు పోలీసు, నిఘా సంస్థల కృషి, చర్యలను సమీక్షించారు. భారతదేశంలోని కుటుంబ విధానం, సంప్రదాయాలు, కుటుంబ విలువలు.. యుతవ ఐసీస్‌వైపు ఆకర్షితులవకుండా కాపాడగలగదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఐసీస్ ప్రభావం, విస్తరణ నామమాత్రంగానే ఉన్నా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలని సూచించారు. ఏమాత్రం అలసత్వం వహించినా సమస్య జఠిలమవుతుందని హెచ్చరించారు. దేశంలోని చాలా ముస్లిం మైనారిటీ సంస్థలు ఐసీస్ సహా ఇతర ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. రాజ్‌నాథ్ అధ్యక్షతన రోజంతా జరిగిన సమీక్షలో జాతీయ గూఢచార, దర్యాప్తు సంస్థల అధిపతులు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగం అధిపతి, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ సహా 12 రాష్ట్రాలు, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖకు చెందిన సీనియర్ అధికారులూ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, జమ్ముకాశ్మీర్, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కర్నాటక, మధ్యప్రదేశ్‌తోపాటు ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. యువతను లోబర్చుకునేందుకు సామాజిక మాధ్యమాలను ఐసీస్ దుర్వినియోగం చేస్తున్న తీరుతెన్నులపై సమావేశంలో లోతుగా చర్చించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అదుపుచేయడమెలా? అన్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందని అంటున్నారు. ఐసీస్‌వైపు తెలంగాణ మైనారిటీ యువత ఎక్కువగా ఆకర్షితులవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెబుతున్నారు. అలాగే మహారాష్ట్ర యువత సైతం ఎక్కువ సంఖ్యలో ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలను అడ్డుకునేందుకు పకడ్బందీ వ్యూహానికి సమావేశంలో రూపమిచ్చినట్టు చెబుతున్నారు. భారత్ నుంచి ఇప్పటి వరకూ ఆకర్షితులై ఐసీస్‌లో చేరితే, అందులో ఆరుగురు చనిపోయారన్నారు. మిగిలిన వారంతా యాక్టివ్‌గా ఉన్నారని రాజ్‌నాథ్ వివరించారు. అయితే, ఈ పరిస్థితులను అడ్డుకునే వ్యూహంలో తల్లిదండ్రుల ప్రాధాన్యత ఎక్కువ ఉండేలా చూడాలన్న అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమయ్యాయి. ఉగ్రవాదంవైపు ఆకర్షితులు కాకుండా చూడాలంటే, మైనారిటీలకు ఎలాంటి సంక్షేమాన్ని అమలు చేయాలన్న అంశాన్నీ పరిశీలించారు. సోషల్ మీడియా, పోలీసు, నిఘా వ్యవస్థ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజ్‌నాథ్ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. సామాజిక మాధ్యమాలను అనుక్షణం పరిశీలించటంతోపాటు ఐసీస్ ఉపయోగించే నిగూఢ సాంకేతిక వ్యవస్థను ఛేదించటంపై లోతుగా చర్చ జరిగిందంటున్నారు. మైనారిటీ యువత ఛాందస ఆలోచనా విధానాలకు బదులు ఆధునిక విద్యవైపు మళ్లించేందుకు అనుసరించాల్సిన సమగ్ర విధానాన్ని రూపొందించాలనే అభిప్రాయం సమావేశంలో వెల్లడైందని అంటున్నారు. నిరంతర జాగృతి, విద్యద్వారా మాత్రమే లక్ష్యం సాధించగలుగుతామని సీనియర్ అధికాకార్లు సూచించారు.

చిత్రం... ఉన్నతస్థాయి భద్రతా సమావేశంలో
మాట్లాడుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్